Multibagger Penny Stocks: రైస్ మిల్లింగ్ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. ఈ షేర్ లో రూ. లక్ష పెట్టుబడిగా పెట్టిన వారికి రూ. 2 కోట్ల రాబడిని అందించింది. అంటే సుమారు 200 రెట్ల లాభం అనమాట. 5 ఏళ్ల క్రితం రూ. 3 గా లిస్టయిన ఒక్కోషేరు ధర తాజాగా రూ. 592కు చేరింది. కేవలం ఐదు సంవత్సరాల కాలంలో జీఎమ్ఆర్ ఓవర్సీస్ కంపెనీ(GRM Overseas) తన కంపెనీ పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను అందించింది. స్టాక్ మార్కెట్‌లో(Stock Market) పెట్టుబడులు పెట్టడం అంటే అది ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంతో సమానం. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు బిజినెస్ మోడల్, భవిష్యత్తులో కంపెనీ వ్యాపారానికి ఉండే అవకాశాలను మార్కెట్ దిగ్గజ పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు పరిశీలించి తమ అంచనాలకు అనుగుణంగానే పెన్నీ స్టాక్స్, చిన్న కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంటారు.
కానీ.. ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ కంపెనీ షేర్ కూడా కొంతమేర విలువను కోల్పోయింది. ఈ క్రమంలో షేర్ ధర 17 శాతం మేర పతనమైంది. అయితే గడచిన ఆరు నెలల సమాచారాన్ని పరిశీలిస్తే షేర్ మంచి పెరుగుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాంబే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఈ కంపెనీ ఏడాది క్రితం రూ. 68 గా షేర్ విలువ ప్రస్తుతం రూ. 592గా ఉంది. GRM Overseas షేర్ ధర ఛార్ట్ ప్యాటర్న్ గురించి ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ.. ‘GRM Overseas షేర్లు 200 రోజుల మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. జనవరి 2022లో జీవిత కాల గరిష్ఠ ధర అయిన రూ.935.40ను తాకిన ఈ షేర్.. ఆ తరువాత పతనమవటం మనం గమనించవచ్చు.
గమనిక: మల్టీ బ్యాగర్ పెన్నీ షేర్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. ఈ సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేయకండి. మీ సొంత నిర్ణయాలపై పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.
ఇవీ చదవండి..
Black Stone: అత్యధిక జీతం తీసుకునేవాళ్లలో ఆయనే తోపు.. ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..
Gold Silver Price Today: మహిళలకు షాకింగ్.. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు