Farmers: రైతులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌.. గ్రీన్‌ సిగ్నల్‌.. ఇక డబ్బే.. డబ్బు..!

Farmers: పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోకుండా, అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ వల్ల రైతులకు మంచి ధర లభిస్తుంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు నేరుగా లాభాలు అందే అవకాశం ఉంటుంది. స్థానికంగా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అటు రైతులకు అన్యాయం జరగకుండా..

Farmers: రైతులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌.. గ్రీన్‌ సిగ్నల్‌.. ఇక డబ్బే.. డబ్బు..!
Farmers

Updated on: Apr 23, 2026 | 9:24 AM

Farmers: దేశ రాజధాని నుంచి రైతులకు ఒక గొప్ప శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గోధుమల దిగుబడి వస్తున్న తరుణంలో, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతికి కేంద్రం అనుమతిని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా తీసుకోలేదు. మార్కెట్ పరిస్థితులు, దిగుబడి అంచనాలపై లోతైన సమీక్ష తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పెరిగిన సాగు విస్తీర్ణం: గత ఏడాది 328.04 లక్షల హెక్టార్లలో గోధుమలు సాగు చేయగా, రబీ 2026 సీజన్‌లో అది 334.17 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2025-26 సంవత్సరానికి గాను ఏకంగా 1202 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ప్రభుత్వ గోదాముల్లో అవసరానికి మించి నిల్వలు ఉండటంతో ఎగుమతులకు మార్గం సుగమమైంది.

ఇది కూడా చదవండి: Success Story: ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్నాడు.. 4 నెలల్లోనే రూ.1 కోటి విలువైన కంపెనీని నిర్మించిన 24 ఏళ్ల యువకుడు!

ఇవి కూడా చదవండి

ఎంత మొత్తంలో ఎగుమతులు జరగనున్నాయి?

కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా అనుమతులు ఇస్తూ వస్తోంది. మొదట జనవరి 2026లో 5 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో మరో 25 లక్షల టన్నుల గోధుమలు, తాజాగా మరో 25 లక్షల టన్నులకు అనుమతి.
మొత్తంగా ఇప్పటివరకు 50 లక్షల టన్నుల గోధుమలు, 10 లక్షల టన్నుల గోధుమ ఉత్పత్తుల ఎగుమతికి కేంద్రం ఓకే చెప్పింది.

రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి?

గిట్టుబాటు ధర: పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోకుండా, అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ వల్ల రైతులకు మంచి ధర లభిస్తుంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు నేరుగా లాభాలు అందే అవకాశం ఉంటుంది. స్థానికంగా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అటు రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం సమతుల్యతను పాటిస్తోంది. అటు కష్టపడి పండించే రైతుకు లాభం చేకూర్చడం, ఇటు దేశ ఆహార భద్రతకు ఢోకా లేకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న గోధుమ రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మార్కెట్ నిల్వలు, ధరల ట్రెండ్‌ను బట్టి ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

500 రూపాయల నోట్లను ఎక్కడ ముద్రిస్తారు? నోటుకు ఎంత ఖర్చు..? ఆసక్తికర విషయాలు..!

Gas Cylinder: ఓన్లీ ఆధార్‌ ఉంటే చాలు.. 5 నిమిషాల్లోనే గ్యాస్‌ సిలిండర్‌.. బుకింగ్‌ అవసరమే లేదు!

Gold Price Today: అదే ధరతో ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us