Post Office Scheme: సూపర్‌ స్కీమ్‌.. నెలకు రూ.1500 డిపాజిట్‌ చేస్తే చాలు.. చేతికి రూ.31 లక్షలు!

ఈ స్కీమ్‌లో పెట్టుబడిదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షికంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రీమియం చెల్లింపునకు 30 రోజుల వ్యవధి ఉంటుంది. వినియోగదారులు పాలసీ వ్యవధిని కోల్పోయినా మిగిలిన ప్రీమియం చెల్లించి పాలసీని పునరుద్ధరించుకునే సదుపాయాన్ని కూడా ఈ పథకంలో ఉంది..

Post Office Scheme: సూపర్‌ స్కీమ్‌.. నెలకు రూ.1500 డిపాజిట్‌ చేస్తే చాలు.. చేతికి రూ.31 లక్షలు!
ఖాతా ఎవరు తెరవొచ్చు: దేశంలోని ఏ పౌరుడైనా పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో ఖాతాను తెరవవచ్చు. పిల్లల పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. పిల్లల వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, అతని తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అతని పేరు మీద ఖాతాను తెరవవచ్చు. పిల్లవాడు 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతను ఖాతాను స్వయంగా నిర్వహించే హక్కును కూడా పొందవచ్చు. MIS ఖాతా కోసం, మీరు తప్పనిసరిగా పోస్టాఫీసులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డును అందించడం తప్పనిసరి.

Updated on: Oct 28, 2024 | 6:17 PM

పొదుపు పథకాలు ప్రజల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఆర్థిక కొరత నుండి వారిని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆర్థిక భద్రతను అందించే అటువంటి పథకం ప్రభుత్వ పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్. ఈ పథకంలో రూ.1,500 పెట్టుబడి పెడితే రూ.31 లక్షల ఆదాయం పొందవచ్చు. ప్రత్యేక పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దీర్ఘకాలిక పెట్టుబడిపై మంచి రాబడిని పొందవచ్చు. ఆ స్కీమ్ ఏంటో, అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం.

గ్రామ సురక్ష యోజన పొదుపు పథకం:

మనిషి జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ సురక్షితమైన భవిష్యత్తు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం పొదుపు చేయాలి. దీంతో ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మంచి రాబడులు వస్తాయి. అటువంటి పథకం గ్రామ సురక్ష యోజన పొదుపు పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి వయోపరిమితి, పెట్టుబడి మొత్తం పరిమితి ఉంది.

ఇవి కూడా చదవండి

గ్రామ సురక్ష యోజన పథకం ప్రత్యేకతలు:

ఈ గ్రామ సురక్ష యోజన పథకంలో పెట్టుబడి పెట్టడానికి వయోపరిమితి ఉంది. అంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులు 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. 19 ఏళ్లలోపు, 55 ఏళ్లు పైబడిన వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టలేరు. ఈ పథకంలో పెట్టుబడికి వయస్సు వంటి పరిమితి ఉంటుంది. దీని ప్రకారం, మీరు ఈ పథకంలో కనీసం రూ.10,000 నుండి గరిష్టంగా రూ.10 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Ratan Tata: పెంపుడు కుక్కతో పాటు పని మనుషులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా!

ఈ స్కీమ్‌లో పెట్టుబడిదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షికంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రీమియం చెల్లింపునకు 30 రోజుల వ్యవధి ఉంటుంది. వినియోగదారులు పాలసీ వ్యవధిని కోల్పోయినా మిగిలిన ప్రీమియం చెల్లించి పాలసీని పునరుద్ధరించుకునే సదుపాయాన్ని కూడా ఈ పథకంలో ఉంది.

గ్రామ సురక్ష యోజన స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 55 ఏళ్లు, 58 సంవత్సరాలు, 60 ఏళ్లు.. ఇలా ఉంటుంది. మీ వయసును బట్టి ప్రీమియం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయసులో రూ.10 లక్షల ప్రీమియం ఎంచుకుంటే అతను 55 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజకు 50 రూపాయలు. అదే.. అతను 58 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే.. అప్పుడు నెలకు రూ.1,463 ప్రీమియం చెల్లించాలి. 60 సంవత్సరాల వరకైతే రూ.1,411 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

రాబడి ఇలా..

  1. ఈ పథకంలో మీరు ఏన్నేళ్లు పెట్టుబడి చేశారనేదానిని బట్టి మీకు వచ్చే రాబడి ఉంటుందని గుర్తించుకోవాలి. మీరు 19 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వరకు స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీకు రూ.31.60 లక్షలు తిరిగి వస్తాయి.
  2. అదే.. 19 నుంచి 58 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే 33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి.
  3. ఈ మెచ్యూరిటీ సొమ్ము 80 ఏళ్లు నిండిన తర్వాత అందుతుంది.
  4. ఒకవేళ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే.. మీ స్కీమ్, అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియం ఆధారంగా నామినీకి చెల్లిస్తారు.
  5. ఈ స్కీమ్‌ను ప్రారంభించిన మూడు సంవత్సరాల తరవాత పాలసీదారుడు స్వచ్ఛందంగా దీన్ని నిలిపేయవచ్చు.
  6. ఈ స్కీమ్​లో బోనస్‌ కూడా ఉంటుంది. అంటే.. మీరు డిపాజిట్ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు సంవత్సరానికి రూ.60 బోనస్ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us