Service Charge: రెస్టారెంట్‌కు వెళ్తున్నారా.. అయితే సర్వీస్ ఛార్జీ చెల్లించొద్దు..!
రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలపై కొంత కాలంగా చర్చ సాగుతోంది. తాజాగా దీనిపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. రెస్టారెంట్ ద్వారా సర్వీస్ ఛార్జీ విధించడం చట్టవిరుద్ధమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( NRAI) ప్రకటించింది...
రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలపై కొంత కాలంగా చర్చ సాగుతోంది. తాజాగా దీనిపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. రెస్టారెంట్ ద్వారా సర్వీస్ ఛార్జీ విధించడం చట్టవిరుద్ధమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( NRAI) ప్రకటించింది. సర్వీస్ చార్జీ విధించడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్ కబీర్ సూరి మాట్లాడుతూ, ఈ అంశంపై ఇంకా ఎటువంటి చట్టం చేయలేదని, కాబట్టి దీనికి సంబంధించిన నిబంధన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. రెస్టారెంట్లు తమ బిల్లుకు ప్రత్యేక సర్వీస్ ఛార్జీని జోడించలేవని వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీన్ని అరికట్టేందుకు చట్టం తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ప్రకటనపై సూరి స్పందిస్తూ, “రెస్టారెంట్‌ను సందర్శించే అతిథులకు సేవ చేసే సిబ్బందికి సర్వీస్ ఛార్జీ. ఇది రెస్టారెంట్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ పంపిణీ చేస్తారు.
రెస్టారెంట్లు మొత్తం బిల్లులో 10 శాతం సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తాయి. ఈ అంశంపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, రెస్టారెంట్లు తమ సొంత ఆలోచనపై సేవా ఛార్జీని జోడిస్తాయని చెప్పారు. నిబంధనల ప్రకారం ఇది ఐచ్ఛికంగా ఉండాలి. వినియోగదారు కోరుకుంటే తప్ప, సర్వీస్ ఛార్జీని రెస్టారెంట్ బిల్లుకు జోడించకూడదని అన్నారు. సర్వీస్ చార్జీని రెస్టారెంట్ బలవంతంగా వసూలు చేస్తుందని మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖలో పేర్కొంది.