AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel Price ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందా? మంత్రి ఏమన్నారంటే..

ప్రభుత్వం ఇటీవల 6 నెలల్లో రెండోసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించింది. ఆ తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 36 నెలల కనిష్టంగా ఉంది. ఇక 30 నెలల తర్వాత రూ.900కి తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేశంలోని సామాన్యులు తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలో దాదాపు రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్తంభించిపోయాయి. ఏప్రిల్ 2022 నుండి చమురు మార్కెటింగ్ కంపెనీల..

Petrol, Diesel Price ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందా? మంత్రి ఏమన్నారంటే..
Hardeep Singh Puri
Subhash Goud
|

Updated on: Mar 10, 2024 | 8:37 AM

Share

ప్రభుత్వం ఇటీవల 6 నెలల్లో రెండోసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించింది. ఆ తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 36 నెలల కనిష్టంగా ఉంది. ఇక 30 నెలల తర్వాత రూ.900కి తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేశంలోని సామాన్యులు తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలో దాదాపు రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్తంభించిపోయాయి. ఏప్రిల్ 2022 నుండి చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి ఎటువంటి మార్పు లేదు. మే 2022లో పన్నులను తగ్గించడం ద్వారా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. ఇప్పుడు ఈ విషయంలో పరిస్థితిని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఈ విషయంలో దేశ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చౌకగా లభించే పెట్రోల్‌, డీజిల్‌పై పెట్రోలియం మంత్రి ఎలాంటి సమాధానం చెప్పారో తెలుసుకుందాం.

చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు డీజిల్‌ విక్రయంపై అండర్‌ రికవరీ కొనసాగుతోందని మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించే అవకాశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల స్థిరత్వం, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. పశ్చిమాసియా.. ప్రస్తుతం అక్కడ దాడులు కొనసాగుతున్నాయని ఉటంకించారు. దీంతో బీమా, సరుకు రవాణా ధరలు పెరిగాయి. దీని కారణంగా ఇంధన మార్కెట్‌లో అస్థిరత కనిపిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రెండుసార్లు పన్ను తగ్గింపు

ఇవి కూడా చదవండి

నవంబర్ 2021, మే 2022 లో ఎక్సైజ్ సుంకం తగ్గింపులతో 2021 నుండి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండుసార్లు తగ్గించిందని ఆయన అన్నారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.13 తగ్గింపు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించారు. రెండు పర్యాయాలు పన్ను తగ్గింపు వల్ల కేంద్రానికి దాదాపు రూ.2.2 లక్షల కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఉత్పత్తిని తగ్గించినప్పటికీ ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగలేదన్నారు. అంటే గ్లోబల్‌ ఆయిల్‌ మార్కెట్‌ దీన్ని గ్రహిస్తోంది. శుక్రవారం, గల్ఫ్ దేశాల నుండి ముడి చమురు ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్‌లో బ్యారెల్‌కు $ 82.08 వద్ద ముగిసింది, ఇది మునుపటి ముగింపు కంటే 1.06 శాతం తక్కువ.

గృహ గ్యాస్ సిలిండర్ చౌకగా..

ప్రభుత్వం శనివారం నుంచి ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గించింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై హర్‌దీప్‌ సింగ్‌ పూరి మాట్లాడుతూ… మార్చి 31తో ముగియాల్సిన ఎల్‌పీజీ సిలిండర్‌ సబ్సిడీని 2024-25 వరకు పొడిగిస్తున్నట్లు కేబినెట్‌ సమావేశంలో ప్రధాని మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. సెప్టెంబర్ 2021 నుండి సెప్టెంబర్ 2023 వరకు ఢిల్లీలో సిలిండర్ ధర 4.56 శాతం తగ్గిందని పూరీ తెలిపారు. సిలిండర్ల లభ్యత విషయంలో ఎక్కడా ఇబ్బంది లేదు.. ఈశాన్యంలో వరదలు వచ్చినప్పుడు మా కార్యకర్తలే స్వయంగా సిలిండర్లు పంపిణీ చేశారని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి