Crypto Currency: తాజా బడ్జెట్ లో క్రిప్టో డిజిటల్ ఆస్తులపై(Digital Assets) 30 శాతం పన్ను విధిస్తానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా క్రిప్టోలపై పన్నును జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. క్రిప్టో ట్రాన్సాక్షన్ మెుత్తం విలువపై దీనిని వసూలు చేయనున్నారు. ప్రస్తుతం క్రిప్టో ఎక్ఛేంజ్ లు అందిస్తున్న సేవలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. క్రిప్టోలు బెట్టింగ్, క్యాసినో, లాటరీ వంటిదని అందువల్ల దానిపై 28 శాతం పన్ను వసూలు చేయాలని జీఎస్టీ అధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు క్రిప్టో ఆస్తులను నగదుగాను లేదా సెక్యూరిటీలుగాను గుర్తించనందున చట్టపరిధిలోకి దానిని ఏ విధంగా పరిగణలోకి తీసుకొస్తారనేది గమనించాలని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ జీఎస్టీ చెల్లింపులపై క్లెయిమ్ ఎలా ఉండనుందనేది ఇంకా స్పష్టతలేని అంశంగా ఉంది. ముందుగా క్రిప్టోలు వస్తువా.. సేవనా అనే దానిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పై 30 శాతం ఆదాయపన్నుతో పాటు సెజ్ వసూలు చేయటాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రస్తుతానికి వీటి నుంచి వచ్చే ఆదాయాన్ని జూదం నుంచి వచ్చే ఆదాయంగా పరిగణిస్తూ అత్యధికంగా 30 శాతం పన్ను వసూలుకు నిర్ణయం జరిగింది. జులై 1 నుంచి రూ. 10,000 లకు పైన చేసే డిజిటల్ క్రిప్టో పేమెంట్లపై 1 శాతం టీడీఎస్ వసూలు చేయనుంది. క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థను అస్థిరతకు గురిచేస్తాయని.. వాటిని నియంత్రించటం అత్యవసరమని భావించిన భారత్ అందుకు అనుగుణంగా ఎక్కువ టాక్స్ పరిధిలోకి వీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ.. ప్రస్తుతం క్రిప్టోలకు ఉన్న క్రేజ్ ను ఈ పన్ను తాత్కాలికంగా నిలువరించినా.. భవిష్యత్తులో పరిణామాలు మారతాయని కొంతమంది మార్కెట్ నిపుణులు అంటున్నారు. మెుత్తానికి భారత్ లో ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ తీసుకురానున్నందున పరిస్థితులు ఎలా ఉండనున్నాయన్నది ప్రస్తుతానికి చెప్పలేని అంశం.
ఇవీ చదవండి..
Ratan Tata: తగ్గేదే లే అంటున్న రతన్ టాటా.. చేతులెత్తేసిన అమెరికా దిగ్గజం..!
Gold Silver Price Today: నిలకడగా బంగారం, వెండి ధరలు.. దేశంలో తాజా రేట్ల వివరాలు