Cooking Oils: హోలీకి ముందు వంటనూనెల ధరలు పెరగడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. అయితే ఆయిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రాష్ట్రాలు వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ మెషినరీని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో పాటు కృత్రిమంగా ధరలు పెంచకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. హోర్డింగ్, ధరల పెరుగుదలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయిలో నిఘా పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. గత వారం రోజులుగా శుద్ధి చేసిన ఆయిల్ ధర లీటరుకు దాదాపు రూ.25, బాదంపప్పు కిలో రూ.20 నుంచి 30 వరకు పెరిగింది. రానున్న రోజుల్లో పెరుగుతున్న వంట నూనెల ధరలు గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది. గత నెలలో దేశీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు 25 నుంచి 40 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల సన్ ప్లవర్ నూనె, పామాయిల్, సోయాబీన్ నూనె సరఫరాపై పెద్ద దెబ్బపడింది. ఉక్రెయిన్ నుంచి సన్ ప్లవర్ పువ్వుల సరఫరాపై కూడా ఈ ఎఫెక్ట్ ఉంది. దీంతో పామాయిల్ దిగుమతులు దెబ్బతిన్నాయి. అదనంగా ఇది సోయాబీన్ నూనె సరఫరాను ప్రభావితం చేస్తుంది.
కేవలం నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు రూ.125 నుంచి రూ.170-180కి పెరిగాయి. కిలో రూ.70 – 80 ఉండాల్సిన నూనె ధరలు నేడు రూ.200 వరకు పెరిగాయి. మే లేదా జూన్‌లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదల పరిమాణం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇది ఖచ్చితంగా చిన్న పెరుగుదల మాత్రం కాదు. మరోవైపు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలైన రిలయన్స్, డిమార్ట్, స్పెన్సర్స్ వంటి మార్టుల్లో ప్రతీరోజు ధరలు మారుస్తూ ప్రజల్ని విపరీతంగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా వంటనూనె ధరల్ని, నిత్యావసరాల ధరల్ని తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు.