Vehicle Registration: కేంద్ర రోడ్డు రవాణా& రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1 నుంచి 15 సంవత్సరాల కంటే పాత వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను పునరుద్ధరించడానికి చెల్లించవలసిన రుసుములను భారీగా పెంచనుంది. ఈ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొత్తగా నిర్ణయించిన ధరలు అమలులో ఉన్న పాత ధరలకంటే 8 రెట్టు అధికంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పెరిగి ధరలు 2022 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తాయి. కానీ.. ఈ కొత్త నిబంధనలు దిల్లీలోని 10 నుంచి 15 సంవత్సరాల కంటే పాత డీజిల్, పెట్రోల్ తో నడిచే వాహనాలు రీ రిజిస్ట్రేషన్ కు వర్తించవని తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి 15 సంవత్సరాల పాత కారును రెన్యూవల్ చేసుకోవడానికి రూ. 5000 చెల్లిచాల్సి ఉంటుంది. గతంలో ఈ ఖర్చు కేవలం రూ. 600గా ఉండేది. అదే ద్విచక్రవాహనాలకు గతంలో రూ. 300 చెల్లించాల్సి ఉండగా.. ప్రస్తుతం రూ. 1000 ఖర్చవుతుంది. ఇదే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్ల విషయంలో.. రూ.15 వేలుగా ఉన్న ఈ ధర.. రూ. 40 వేలు చెల్లించాలి.
ఈ వ్యవహారంలో దిల్లీ ప్రభుత్వం ఒక వెసులుబాటును కల్పించింది. 10 నుంచి 15 సంవత్సరాల పాత పెట్రో డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఏజెన్సీల నుంచి మాత్రమే వాహనాల్లో మార్పులు చేసుకోవచ్చని వెల్లడించింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ ఇందుకోసం ఆరు మ్యానుఫ్యాక్చురర్లను ఎంపిక చేసింది. ఒకవేళ ఇలా వద్దనుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని వేరే రాష్ట్రం వారికి వాహనాన్ని అమ్మవచ్చు లేదా స్కాప్ పాలసీ కింద కొత్త వాహనం కొనుగోలు సమయంలో ప్రభుత్వం అందించే ప్రయోజనాలను వాహనదారులు పొందవచ్చు.
ఇవీ చదవండి..
Money Saving Ideas: డబ్బు సేవ్ చేయటంలో ఈ టిప్స్ పాటించండి.. ఆర్థిక మెరుగుదలకు ఇలా చేయండి..