Multibagger Stocks: మూడు నెలల్లో లక్షను.. రూ.2 లక్షలు చేసిన ప్రభుత్వ రంగ స్టాక్.. 1000 రెట్లు పెరిగిన లాభం..

|

May 31, 2022 | 6:41 AM

Multibagger Stocks: గత కొన్ని నెలల నుంచి స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో తమ పెట్టుబడులను విత్‌డ్రా చేస్తున్నారు.

Multibagger Stocks: మూడు నెలల్లో లక్షను.. రూ.2 లక్షలు చేసిన ప్రభుత్వ రంగ స్టాక్.. 1000 రెట్లు పెరిగిన లాభం..
stock market
Follow us on

Multibagger Stocks: గత కొన్ని నెలల నుంచి స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో తమ పెట్టుబడులను విత్‌డ్రా చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం రాబడిని ఇవ్వటంలో తమ దూకుడును మాత్రం తగ్గించటం లేదు. తగ్గేదే లే అన్నట్లుగా పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ ఒడిదొడుకులను అధిగమించిన కొన్ని స్టాక్‌లు ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(MRPL) స్టాక్ కూడా ఈ కోవకు చెందినదే.

MRPL స్టాక్ గత మూడు నెలల్లో ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది. ఫిబ్రవరి 25న బిఎస్‌ఈలో దీని షేర్ ధర రూ.39.55గా ఉంది. గత వారం మే 27 నాడు షేర్ విలువ రూ.78.30కి చేరింది. ఈ విధంగా గత మూడు నెలల్లో MRPL షేర్ విలువ 100 శాతానికి పైగా పెరిగింది. అంటే మదుపరుల సంపద అమాంతం రెండితల మేర పెరిగింది. ఒక ఇన్వెస్టర్ మూడు నెలల క్రితం మంగళూరు రిఫైనరీ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. దాని విలువ ఇప్పుడు రూ.2 లక్షలుగా ఉండేది. గత మూడు నెలల్లో BSE సెన్సెక్స్ 4 శాతం కంటే ఎక్కువ పడిపోయిన సమయంలో ఈ మిడ్‌క్యాప్ స్టాక్ తన పెట్టుబడిదారులకు మాత్రం మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. అయితే ప్రస్తుతం MRPL స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి పడిపోయింది. మే 23న రూ.95.95 వద్ద 52 వారాల గరిష్ఠ స్థాయిని ఈ ప్రభుత్వరంగ కంపెనీ తాకింది.

స్టాక్ మార్కెట్లో కంపెనీ అద్భుతమైన ఫలితాలను ఇవ్వడమే కాకుండా.. మార్చి క్వార్టర్ లో కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మార్చి క్వార్టర్ లో మంగళూరు రిఫైనరీ నికర లాభం 1006 శాతం పెరిగి రూ.3,008 కోట్లగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.271.86 కోట్లుగా ఉంది. ఈ కాలంలో కంపెనీ అమ్మకాల్లో 82.17 శాతం పెరుగుదల నమోదు కావటంతో వాటి విలువ రూ.24,803 కోట్లకు చేరుకున్నాయి. మంగళూరు రిఫైనరీ ముడి చమురును శుద్ధి చేసే వ్యాపారంలో ఉంది. కంపెనీ గ్యాస్, ద్రవ ఇంధనాలను తయారు చేస్తుంది. ఇది కాకుండా.. మంగళూరు రిఫైనరీ హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, ఏవియేషన్ ఇంధనాన్ని కూడా తయారు చేస్తోంది.