భారతీయ రూపాయికి ఓ పెద్ద చరిత్ర ఉంది. అందులో ఈ రోజు అంటే జూన్ 1కు మరింత ప్రత్యేక సంబంధం ఉంది. అదేంటో తెలుసుకునేముందు కరెన్సీ, నాణేలు ఏంటో తెలుసుకుందాం. మన దేశంలో చిల్లర లావాదేవీలన్నీ కరెన్సీ, నాణేల చుట్టూనే తిరుగుతూ చెల్లింపు వ్యవస్థగా మారుతుంది.
భారత కరెన్సీని భారతీయ రూపాయి, నాణేలను పైసలుగా పిలుస్తారు. ఒక రూపాయకు వంద పైసలు ఇలా… ప్రస్తుతం మన దేశంలో 5,10, 20,50,100,200, 2000 నోట్లు ఉన్నాయి. ఇలా నాణేలు కూడా చలామణిలో ఉన్నాయి.
1957 కు ముందు భారత రూపాయి లేదు. 1835 నుండి 1957 వరకు రూపాయి 16 అణాలుగా విభజించబడింది. ప్రతి అణాను నాలుగు భారతీయ పైస్‌లుగా.. ప్రతి పైస్‌ను మూడు భారతీయ పైస్‌లుగా 1947 వరకు పై డీమోనిటైజ్ చేసే చేశారు. 1955 లో నాణేల కోసం మెట్రిక్ విధానాన్ని అవలంబించడానికి భారతదేశం “ఇండియన్ కాయినేజ్ యాక్ట్” ను సవరించింది.
పైసా నాణేలు 1957 లో ప్రవేశపెట్టబడ్డాయి. కాని 1957 నుండి 1964 వరకు ఈ నాణెంను “నయా పైసా” (ENGLISH: న్యూ పైసా ) అని పిలిచేవారు. 1 జూన్ 1964 న “నయా” అనే పదాన్ని తొలగించారు. “ది డెసిమల్ సిరీస్” లో భాగంగా నయా పైసా నాణేలు జారీ చేయబడ్డాయి. నయా పైసా నాణెం 30 జూన్ 2011 న డీమోనిటైజ్ నుంచి ఉపసంహరించబడింది.