Banking Sector: బ్యాంకుల ప్రైవేటీకరణపై చట్టం.. శీతాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2021 బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రకటించారు. ఇప్పుడు ఈ దిశగా పనులు కూడా ప్రారంభం అయ్యాయి. నివేదికల ప్రకారం.. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టంలో మార్పులు చేసే అవకాశం ఉంది. నవంబర్ 29 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం బ్యాంకింగ్ చట్టం 1970లో మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ శీతాకాల సమావేశంలో ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 నియంత్రణను కూడా ప్రవేశపెట్టవచ్చు. డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 సహాయంతో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ప్రైవేటు క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించే అవకాశం కూడా ఉంది.
బ్యాంకుల ప్రైవేటీకరణ
ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లో బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ సౌమ్యదత్తా తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని అన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరించినట్లయితే రుణాలు సులభంగా అందే అవకాశం ఉండదు. దేశంలో డిపాజిట్ల మూలధనంలో 70 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే జమ అవుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వడం దారుణమన్నారు.
క్రిప్టోకరెన్సీలను నియంత్రించడానికి చట్టం..
నివేదికల ప్రకారం.. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ బిల్లు 2021ను ప్రవేశపెడుతోంది. ఈ చట్టం సహాయంతో అన్ని ప్రైవేటు కరెన్సీలు నిషేధించబడతాయని నమ్ముతున్నారు. ఇందులో కొంత సడలింపు కూడా ఇచ్చారు. ఇటీవల క్రిప్టోకరెన్సీకి సంబంధించి ప్రధాని మోదీ ఉన్న స్థాయి సమావేశం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి: