Credit Card: గూగుల్ పే వాడేవారికి సూపర్ ఛాన్స్.. అద్భుత ఫీచర్లతో ప్రత్యేక క్రెడిట్ కార్డ్ లాంచ్.. ఎక్కడ వాడినా ఆఫర్లే ఆఫర్లు..

కొత్త క్రెడిట్ కార్డులు తీసుకోవాలనుకునేేవారికి శుభవార్త. గూగుల్ పే వాడేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. యాక్సిస్ బ్యాంకుతో కలిసి కొత్త క్రెడిట్ కార్డును గూగుల్ పే లాంచ్ చేసింది. ఇది వాడేవారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Credit Card: గూగుల్ పే వాడేవారికి సూపర్ ఛాన్స్.. అద్భుత ఫీచర్లతో ప్రత్యేక క్రెడిట్ కార్డ్ లాంచ్.. ఎక్కడ వాడినా ఆఫర్లే ఆఫర్లు..
Google Pay

Updated on: Jan 31, 2026 | 5:11 PM

ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ అయిన గూగుల్ పేను దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎక్కువమంది వాడుతున్న యాప్ గా ఇది కొనసాగుతోంది. క్యాష్ బ్యాక్, రివార్డ్స్, ఆఫర్లు లాంటివి ఎక్కువ ఇస్తుండటంతో గూగుల్ పేను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువమంది యూజర్లను తెచ్చుకునేందుకు గూగుల్ పే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా క్రెడిట్ కార్డు సేవలను కూడా గూగుల్ పే ప్రవేశపెట్టింది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తో కలిసి కొత్త క్రెడిట్ కార్డును తన యాప్ లో తీసుకొచ్చింది. కేవలం గూగుల్ పే ద్వారానే ఈ క్రెడిట్ కార్డు పొందవచ్చు. యాక్సిస్ బ్యాంకుతో భాగస్వామ్యంతో ఈ కొత్త క్రెడిట్ కార్డును గూగుల్ పే అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డు తీసుకున్నవారికి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. గూగుల్ పే ఫ్లెక్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఈ కార్డు దరఖాస్తు ఎలా..? బెనిఫిట్స్ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫీచర్లు ఇవే

-గూగుల్ పే ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే కార్డు మంజూరు

-క్రెడిట్ కార్డు ద్వారా నేరుగా స్కాన్ చేసి పేమెంట్స్ చేసే అవకాశం

-డిజిటల్ క్రెడిట్ కార్డు

-రూపే క్రెడిట్ కార్డు. దీని వల్ల క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐను స్కాన్ చేసి సులువుగా షాపుల్లో పేమెంట్స్ చేయవచ్చు

-స్టార్స్ రూపంలో వెంటనే రికార్డ్స్

-ఒక స్టార్ ఒక రూపాయితో సమానం

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

-మీ మొబైల్ లో గూగుల్ పే ఓపెన్ చేయండి

-మనీ సెక్షన్ లోకి వెళ్లండి

-క్రెడిట్ కార్డు లేదా గెట్ ఫ్లెక్స్ అనే ఆప్షన్ ఎంచుకోండి

-అప్లై బటన్ పై క్లిక్ చయండి

-పాన్, ఇన్ కమ్, ఎంప్లాయిమెంట్ వివరాలు అందించండి

-ఆధార్, పాన్ నెంబర్ ఆధారంగా ఈ కేవైసీ పూర్తి చేయండి

-మీరు అర్హులైతే కొన్ని నిమిషాల వ్యవధిలోనే కార్డు మంజూరు అవుతుంది

-డిజిటల్ కార్డు ద్వారా మీరు వెంటనే లావాదావేవీలు చేసుకోవచ్చు

ఫోన్ పే, పేటీఎం కూడా..

గూగుల్ పేనే కాకుండా ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే యూపీఐ యాప్ లు ప్రత్యేక క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తో భాగస్వామ్యంతో ఫోన్ పే అల్టిమో క్రెడిట్ కార్డును తీసుకురాగా.. ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులతో కలిసి పేటీఎం ప్రత్యేక క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది.