Telugu News Business Good news for the youth from that government, Benefit of Rs. 5 lakhs through a special scheme, YUVA Scheme details in telugu
YUVA Scheme: యువతకు ఆ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రత్యేక స్కీమ్ ద్వారా రూ.5 లక్షల లబ్ధి
భారతదేశ జనాభాలో యువ శక్తి అధికంగా ఉంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనా విధానాలు కూడా మారుతున్నాయి. గతంలో బాగా చదువుకుని మంచి ఉద్యోగంతో స్థిరపడాలని కోరుకునే వారు. కానీ ప్రస్తుతం ఏదైనా వ్యాపారం చేసి నలుగురి మంచి గుర్తింపు పొందాలని కోరుకునే వారు కూడా ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడి యువత కోసం ప్రత్యేక పథకాన్ని లాంచ్ చేసింది.
ఉత్తరప్రదేశ్ యువత కోసం అక్కడ ప్రభుత్వం యువతకు రూ.5 లక్షల రూపాయలతో సాయం చేసేలా కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. ముఖ్యంగా ఎలాంటి వడ్డీ లేకుండా రుణం లభిస్తుంది. కానీ లబ్ధిదారుల వయస్సు 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఉత్తరప్రదేశ్ గొప్ప చేతివృత్తులకు ప్రసిద్ధి చెందింది. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ (ఓడీఓపీ) పథకం స్థానిక చేతివృత్తులకు కోసం యూపీ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్’ను ప్రారంభించింది. ఆర్థిక సాయం అందించడంతో పాటు నైపుణ్య అభివృద్ధి ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, వ్యాపారాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రయోజనం ఇలా
రూ.5 లక్షల వరకు 100% వడ్డీ లేని, హామీ లేని రుణం.
అలాగే ప్రాజెక్టు వ్యయంలో 10% సబ్సిడీ
సీజీటీఎంఎస్ఈ ఇతర రుణ పథకాల కింద నాలుగు సంవత్సరాల వరకు రుణ కవరేజ్
పెట్టుబడి ఎంపికలు
వివిధ చేతివృత్తిదారులకు పెట్టుబడికి అవకాశం ఉంటుంది.
జనరల్ కేటగిరీకి 15 శాతం, ఓబీసీ వర్గానికి 12.5 శాతం, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు 10 శాతం
రూ.5 లక్షలకు పైగా (రూ. 10 లక్షల వరకు) ప్రాజెక్టులు కూడా అర్హులు. కానీ ఈ ప్రయోజనం మొదటి 5 లక్షల రూపాయలకు మాత్రమే వర్తిస్తుంది.
శిక్షణ, అర్హతలు
ఈ పథకం లబ్ధిదారులకు అవసరమైతే శిక్షణ కూడా అందిస్తారు. విశ్వకర్మ కార్మిక గౌరవ పథకం కింద ఎస్సీ/ఎస్టీ/ఓబీటీసీలకు శిక్షణ పొందవచ్చు. గుర్తింపు పొందిన నైపుణ్యాల సర్టిఫికేషన్ కార్యక్రమాలు కూడా అందిస్తారు.
21-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం దరఖాస్తు ప్రక్రియ జిల్లా పరిశ్రమలు, వ్యవస్థాపకత ప్రోత్సాహక కేంద్రాల ద్వారా జరుగుతుంది.
బ్యాంకుల ద్వారా సకాలంలో రుణ ఆమోదంతో సబ్సిడీ అందజేత
రూ. 10 లక్షల వరకు
ఈ పథకానికి సంబంధించిన మొదటి దశలో యువతకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. అలాగే రెండవ దశలో ఈ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతారు. ఇప్పటివరకు, 2.5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. 93,000 కు పైగా దరఖాస్తులు బ్యాంకులకు పంపారు. రూ. 348 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేశారు. దాదాపు 9,013 మంది యువ పారిశ్రామికవేత్తలు దీని ద్వారా ప్రయోజనం పొందారు.