School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి వరుస సెలవులు!

School Holidays: ఈ వరుస సెలవులు విద్యార్థులకు మాత్రమే కాదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పని చేసే ఉద్యోగులకు కూడా ఈ సెలవులు రానున్నాయి. కార్పోరేట్, ఐటీ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవానికి లేకున్నా ప్రతి శని, ఆదివారం సెలవే. ఇలా విద్యార్థులకు, ఉద్యోగాలు చేసే..

School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి వరుస సెలవులు!
School Holidays

Updated on: Aug 12, 2026 | 4:03 PM

School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ ఆగస్ట్ లో భారీ సెలవులు వస్తున్నాయి. పండగలు, ప్రత్యేక వేడుకలు, జాతీయ పర్వదినాల సందర్భంగా సెలవులున్నాయి… ఆసక్తికరంగా ఇవి వీకెండ్ తో కలిసిరావడంతో వరుస సెలవులుగా మారుతున్నాయి. ఇలా గత మూడ్రోజులుగా సెలవులు కొనసాగుతున్నాయి… ఆగస్ట్ 8 రెండో శనివారం, 9 ఆదివారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సెలవుంటే ఆగస్ట్ 10న బోనాల తర్వాతరోజు తెలంగాణవ్యాప్తంగా సెలవుంది. ఇలా ఏపీలో 2, తెలంగాణలో 3 రోజులు వరుసగా సెలవులు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఎక్కువ డిటర్జెంట్ వేస్తే ఏమవుతుంది? పెద్ద పొరపాటు చేస్తున్నట్లే..!

పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు ఎగిరిగంతులేస్తారు. ఈనెలలో వరుసగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు మరోమారు వరుసగా రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఆగస్ట్ 15, 16 రెండ్రోజులు దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో సెలవులు వస్తున్నాయి.

ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం. ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత విద్యార్థులకు సెలవు ఉంటుంది. ఇక చిన్న పిల్లలకైతే హాలిడే ప్రకటిస్తారు. కొన్ని స్కూళ్లలో కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లిపోతారు. ఎలాంటి తరగతులు ఉండవు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారిక సెలవు ఉంటుంది. ఇక మరుసటి రోజు ఆగస్ట్ 16 ఆదివారం. సాధారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇలా 15,16 తేదీల్లో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇలా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వరుసగా రెండు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర.. రికార్డ్‌ స్థాయి దిశగా వెండి..!

ఈ వరుస సెలవులు విద్యార్థులకు మాత్రమే కాదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పని చేసే ఉద్యోగులకు కూడా ఈ సెలవులు రానున్నాయి. కార్పోరేట్, ఐటీ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవానికి లేకున్నా ప్రతి శని, ఆదివారం సెలవే. ఇలా విద్యార్థులకు, ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు ఈ వీకెండ్ రెండు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి.

ఆగస్ట్ 13న పేట్రియాట్స్ డే సెలవు

వీకెండ్ హాలిడేస్ కంటే ముందే మణిపూర్ లో మరో ప్రత్యేక సెలవు వస్తోంది. ఆగస్ట్ 13న ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పేట్రియాట్స్ డే సందర్భంగా సెలవు ఉంటుంది. ఆంగ్లో-మణిపురి యుద్దంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళిగా దేశభక్తుల ఈ దినోత్సవం (పేట్రియాట్స్ డే) నిర్వహిస్తారు. అందుకే ఆ రాష్ట్రంలో ఆగస్ట్ 13న (గురువారం) విద్యాసంస్ధలు, ఉద్యోగులకు అధికారిక సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

ఇలా మణిపూర్ విద్యార్థులు, ఉద్యోగులకు ఆగస్ట్ 13, 15, 16 మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. మధ్యలో ఆగస్ట్ 14 (శుక్రవారం) సెలవు తీసుకుంటే వరుసగా నాలుగు రోజుల పాటు ఎంజాయ్‌ చేయవచ్చు. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం కేవలం శని, ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది.

ఇది కూడా చదవండి: Elon Musk: ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!

ఇది కూడా చదవండి: DMart Offers: ఇక పండగే.. పండగ.. డీమార్ట్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్లు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us