Railway Warehouse Workers: ఇండియన్ రైల్వేలో పని చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఈశ్రమ్ పోర్టల్‌పై ఉన్న అసంఘటిత రంగ కార్మికుల జాబితాను మార్చింది. ఈ జాబితాను మార్చడంతో ప్రస్తుతం రైల్వే వేర్‌హౌస్‌లలో పని చేసే కార్మికులు కూడా ఈ ఇ-శ్రమ్ పోర్టల్‌లో చేరవచ్చు. ఈ పోర్టల్‌లో అసంఘటిత కార్మికుల జాబితాలో వేర్‌హౌస్ లేబర్ కూడా కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వీరు కూడా ఈ జాబితాలో పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పోర్టల్‌లో రైల్వే వేర్‌హౌస్‌లో పని చేసే కార్మికులు తమకు తాముగా పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వారు పేర్లను నమోదు చేసుకుంటే ఇ-శ్రమ్ కార్డు వస్తుంది. దీంతో రైల్వే వేర్‌హౌస్‌లో పనిచేసే వర్కర్లు తమకు తాముగా ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. తమ పేర్లను నమోదు చేసుకుంటే, వారికి కూడా ఈ-శ్రమ్ కార్డు వస్తుంది.
రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా..?
ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. దీని తరువాత మీరు ఆధార్‌తో లింక్ చేయబడిన నెంబర్‌తో ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆధార్ నెంబర్‌ను నమోదు చేసి ఓటీపీ ద్వారా ప్రక్రియను కొనసాగించాలి. మీ సమాచారం తెరపైకి వస్తుంది. మీరు దానిని అంగీకరించాలి. మీరు సులభంగానే ఇశ్రమ్ పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ కావచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి ఉంటే సరిపోతుంది. సులభంగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూఏఎన్ నెంబర్ వస్తుంది. తాజాగా అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం వల్ల రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు కుటుంబ సభ్యులకు వస్తాయి. ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష అందిస్తారు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఇవి కూడా చదవండి: