Indian railways: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యేక హెల్త్ కార్డుల రిలీజ్..!
భారతదేశంలో చౌకైన ప్రజా రవాణా సాదనంగా రైల్వేలు ప్రజాదరణను పొందాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే అందరికీ రైలు ప్రయాణం గుర్తుకు వస్తుంది. అలాగే భారతీయ రైల్వే ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్షలాది రైల్వే ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఆ శాఖ శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ విధానంలో ముఖ్యమైన మార్పు చేశారు.
భారతదేశంలో చౌకైన ప్రజా రవాణా సాదనంగా రైల్వేలు ప్రజాదరణను పొందాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే అందరికీ రైలు ప్రయాణం గుర్తుకు వస్తుంది. అలాగే భారతీయ రైల్వే ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్షలాది రైల్వే ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఆ శాఖ శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ విధానంలో ముఖ్యమైన మార్పు చేశారు. ఇకపై ఉద్యోగులు, పెన్షన్‌దారులకు యూనిక్ మెడికల్ ఐడెంటిఫికేషన్ (యూఎంఐడీ) కార్డులను జారీ చేస్తుంది. దీని ద్వారా వారు రైల్వే ప్యానెల్ మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందేందుకు వీలు ఉంటుంది. ఈ కార్డును కేవలం రూ. 100 ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం వల్ల దాదాపు 12.5 లక్షల మంది ఉద్యోగులు, 15 లక్షల మందికి పైగా పెన్షనర్లు, రైల్వే శాఖపై ఆధారపడిన 10 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.
రైల్వే వైద్యులు తమకు ఇష్టమైన ఆసుపత్రులకు రెఫరల్‌లు జారీ చేస్తున్నారని ఉద్యోగులు, పెన్షనర్ల నుండి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పాలసీ ప్రకారం రెఫరల్ లేకుండానే చికిత్స పొందవచ్చని నిపుణులు చెబుతున్న్నారు. పీజీఐఎంఈఆర్ చండీగఢ్, జేఐపీఎంఈఆర్ పుదుచ్చేరి, ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ బెంగళూరుతో పాటు దేశంలోని 25 ఎయిమ్స్ వంటి జాతీయ ఆస్పత్రుల్లో ఎలాంటి రిఫరల్ అవసరం లేకుండా చికిత్స పొందవచ్చు. ఆయా ఆస్పత్రుల్లో చికిత్సతో పాటు అవసరమైన మందులు కూడా అందజేస్తారు.
ఇటీవల రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పరివర్తన) ప్రణవ్ కుమార్ మాలిక్ ప్రత్యేక వైద్య గుర్తింపు (యూఎంఐడీ) కార్డులను తక్షణమే రోల్ అవుట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త విధానాన్ని హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్)తో అనుసంధానించడం ద్వారా యూఎంఐడీ కార్డ్ డిజిలాకర్‌లో సురక్షితంగా ఉంటుంది. యూఎంఐడీ కార్డ్ రైల్వే ఉద్యోగులు, పెన్షనర్ల వ్యక్తిగత ప్రొఫైల్‌లకు నేరుగా లింక్ అవుతుంది. ఈ కొత్త కార్డు ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు లేదా డిపెండెంట్లు రైల్వే ప్యానెల్‌లో ఉన్న ఏదైనా ఆసుపత్రి లేదా డయాగ్నస్టిక్ సెంటర్‌లో చికిత్స పొందవచ్చు. ఈ కార్డు అత్యవసర లేదా సాధారణ చికిత్స కోసం ఉపయోగించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..