EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. విత్ డ్రా పరిమితి భారీగా పెంపు

భారతదేశంలో ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఉద్యోగులతో పాటు యజమానుల సమాన వాటాతో పదవీ విరమణ ప్రయోజనాలతో వచ్చే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో ఇతర పథకాలతో పోలిస్తే భారీ వడ్డీ చెల్లిస్తారు. ఉద్యోగి ప్రాథమిక వేతనంలోని 12 శాతంతో, యజమాని 12 శాతం కలిపి పొదుపుతో పాటు పెన్షన్ స్కీమ్‌లో కూడా పెట్టుబడిపెడతారు.

EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. విత్ డ్రా పరిమితి భారీగా పెంపు
Epfo

Updated on: Sep 26, 2024 | 3:30 PM

భారతదేశంలో ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఉద్యోగులతో పాటు యజమానుల సమాన వాటాతో పదవీ విరమణ ప్రయోజనాలతో వచ్చే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో ఇతర పథకాలతో పోలిస్తే భారీ వడ్డీ చెల్లిస్తారు. ఉద్యోగి ప్రాథమిక వేతనంలోని 12 శాతంతో, యజమాని 12 శాతం కలిపి పొదుపుతో పాటు పెన్షన్ స్కీమ్‌లో కూడా పెట్టుబడిపెడతారు. ఈపీఎఫ్‌లో బయట మార్కెట్‌లోకి ఇతర పథకాలతో పోల్చి చూస్తే భారీగా ఉంటుంది. అయితే అనుకోని అవసరాల నేపథ్యంలో పీఎఫ్‌లోని కొంత భాగాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఇటీవల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాల కోసం ఒక సారి ఉపసంహరణ పరిమితిని రూ. 1 లక్షకు పెంచింది. ఇది గతంలో రూ.50,000గా ఉండేది కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ అప్‌డేట్‌ను అధికారికంగా తెలిపారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ విత్‌డ్రా విషయంలో తాజా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఈపీఎఫ్ఓ సవరించిన తాజా నిబంధనల వల్ల ఏదైనా ఆర్థిక అత్యవసర స్థితి ఉంటే రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది భారతదేశంలోని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా పని చేసే ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకం ద్వారా భారతదేశంలోని వ్యవస్థీకృత రంగ ఉద్యోగుల కోసం ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా పథకాలను నిర్వహిస్తుంది. అయితే తాజా నిబంధనల ప్రకారం అత్యవసర సమయాల్లో చందాదారులకు మరింత ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో పీఎఫ్ విత్‌డ్రా కోసం మీరు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పీఎఫ్ కంట్రిబ్యూటర్లు మొదటి ఆరు నెలల్లో కూడా విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. చందాదారులకు సవాళ్లను తగ్గించే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ తన ​​కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు.

పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడం ఇలా

వైద్య అత్యవసర పరిస్థితులు, వివాహం, విద్య, నిరుద్యోగం, గృహ పునరుద్ధరణ వంటి కారణాల వల్ల ఆర్థిక సాయం కోసం పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. చందాదారులు యూఏఎన్ అధికారిక పోర్టల్ ద్వారా ఉపసంహరణను ఫైల్ చేయవచ్చు. అప్లికేషన్ సమర్పించిన తర్వాత క్లెయిమ్ ఆమోదం కోసం యజమాని లాగిన్‌కి వెళ్తుంది. ఆమోదం పొందిన తర్వాత మొత్తం చందాదారుల ఖాతాలో జమ చేస్తారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..