పీఎఫ్ గురించి దాదాపు ప్రతి ఒక్కరికే తెలిసిందే. ఇక ఉద్యోగం చేస్తున్న వారి ఖాతా నుంచి ప్రతి నెల కొంత భాగం పీఎఫ్ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. అయితే వీటిని ఒక నిర్ణిత సమయంలో మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అయితే ఈ పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి ప్రతి నెల డబ్బులు పొందే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది. సురక్షితమైన దీర్ఘకాల రిటైర్మెంట్ స్కీమ్‌లో ఈపీఎఫ్ పథకం కూడా ఒకటి. ఇది పీఎఫ్ ఖాతా ఉన్నవారికి పెన్షన్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ క్రమంలోనే ఉద్యోగుల నెలవారీ జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాకు వెళ్తుందని తెలిసిన విషయమే. మూల వేతనం, డీఏలో 12 శాతం డబ్బులు పీఎఫ్ అకౌంట్‌లో జమవుతాయి.
ఇక అదే సమయంలో ఉద్యోగి కంపెనీ కూడా పీఎఫ్ అకౌంట్‌లో 12 శాతం మొత్తాన్ని క్రెడిట్ చేస్తుంది. ఇక డబ్బులు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి కొన్ని రకాల నిబంధనలు అమలులో ఉన్నాయి. అలాగే పీఎఫ్ ఖాతాదారులు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల డబ్బులు పొందాలనే భావిస్తే.. ఒక షరతు కూడా ఉంది. అదెంటంటే పీఎఫ్ అకౌంట్ కు కనీసం 15 ఏళ్లు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలాంటి అంతరాయం లేకుండా. ఇందుకోసం ఉద్యోగులు వరుసగా 15 సంవత్సరాలపాటు పీఎఫ్ అకౌంట్ కు కంట్రిబ్యూట్ చేస్తూ రావాలి. ఇలా చేస్తే.. పీఎఫ్ ఖాతాదారులకు కనీసం రూ. 1000 నుంచి పెన్షన్ పొందవచ్చు. పీఎఫ్ ఖాతా కలిగిన వారు సులభంగానే వారి అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఉమాంగ్ యాప్ ఉపయోగించొచ్చు. లేదంటే పీఎఫ్ వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.
ఎల్ఐసీలో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే ప్రతి 3 నెలలకు డబ్బులు.. ఒకేసారి రూ.10 వేలు అందుకునే..