భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా ఈవీ స్కూటర్లు రోడ్లపై రయ్‌రయ్‌మంటూ తిరుగుతున్నాయి. ఈవీ స్కూటర్లలో ఓలా కంపెనీకు చెందిన స్కూటర్లు అధిక ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఓలా మొదటి ఆప్షన్‌గా మారింది. మెరుగైన ఫీచర్లతోపాటు స్టైలిష్ లుక్ వినియోగదారులను కట్టి పడేస్తుంది. అయితే ఓలా స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఆ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక ఆఫర్ కింద ఓలా స్కూటర్ కొనుగోలుపై రూ.20 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. ఓలాకు సంబంధించిన ఓలా ఎస్1 ప్రో, ఎస్1ఎయిర్, ఎస్ 1 వేరియంట్స్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఓలా స్కూటర్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై రూ.15,000 వరకు తగ్గింపును ఇస్తున్నారు. ఈ స్కూటర్లపై జూలై 17 వరకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ సబ్సిడీ ప్రయోజనాలు ఇస్తున్నట్లు ఓలా తెలిపింది. ఓలా లైనప్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో. ఓలా ఎస్1 ప్రో ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.29 లక్షలు. అయితే ఓలా ఎస్1 ఎయిర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.01 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. జూన్‌లో కూడా ఓలా ఈ రెండు స్కూటర్‌లపై ఒకే తరహా ఆఫర్‌ను అందించింది.
ఓలా ప్రారంభ స్కూటర్ అయిన ఓలా ఎస్1పై కూడా బంపర్ డిస్కౌంట్ ఇస్తుంది. ఈ స్కూటర్ కొనుగోలుపై రూ.12,500 ఆదా అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఓలా ఎస్1 అతి తక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.75 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికతో మార్కెట్లో అందుబాటులో ఉంది, ఇది ఒక్కసారి ఛార్జింగ్‌లో 190 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఓలా ఎస్1 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్ స్కూటర్‌పై గరిష్టంగా రూ.20 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. గత నెలతో పోలిస్తే ఈ ఈవీపై రూ.5,000 తగ్గింపు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.85 వేలుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..