Magnite Geza CVT: నిస్సాన్ కార్ల ప్రియులకు శుభవార్త.. మెగ్నైట్ జిజా నయా వెర్షన్ రిలీజ్

తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ గత సంవత్సరం విడుదల చేసిన మెగ్నైట్ జిజా ఎడిషన్ విజయవంతమైన తర్వాత ప్రస్తుతం జిజా సీవీటీ వేరియంట్‌ను లాంచ్  చేసింది. ఈ ఎస్‌యూవీ లాంచ్ చేస్తూ కంపెనీ మాగ్నైట్ గెజా ఎడిషన్ 'జపనీస్ థియేటర్, దాని వ్యక్తీకరణ మ్యూజికల్ థీమ్స్' నుండి ప్రేరణ పొందిందని పేర్కొంది.

Magnite Geza CVT: నిస్సాన్ కార్ల ప్రియులకు శుభవార్త.. మెగ్నైట్ జిజా నయా వెర్షన్ రిలీజ్
Magnite

Updated on: May 24, 2024 | 3:58 PM

భారతదేశంలో కార్లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త కార్లను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ గత సంవత్సరం విడుదల చేసిన మెగ్నైట్ జిజా ఎడిషన్ విజయవంతమైన తర్వాత ప్రస్తుతం జిజా సీవీటీ వేరియంట్‌ను లాంచ్  చేసింది. ఈ ఎస్‌యూవీ లాంచ్ చేస్తూ కంపెనీ మాగ్నైట్ గెజా ఎడిషన్ ‘జపనీస్ థియేటర్, దాని వ్యక్తీకరణ మ్యూజికల్ థీమ్స్’ నుండి ప్రేరణ పొందిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మెగ్నైజీ జిజా సీవీటీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మెగ్నైట్ జిజా ఎడిషన్‌కు సంబంధించిన ఒక సంవత్సరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ మెగ్నైట్ జిజా సీవీటీ ఎడిషన్‌ను రూ. 8.94 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభించింది ఈ వేరియంట్ సాధారణంగా మాగ్నైట్ మ్యూజిక్ ఎడిషన్‌గా పేర్కొంటున్నారు. అలాగే ఈ కంపెనీ ఈ ఎస్‌యూవీ పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు ప్రీమియం సౌండ్ సిస్టమ్‌తో కూడిన మ్యూజిక్ ప్యాకేజీతో అమర్చింది. ఈ లాంచ్ గురించి నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ గత సంవత్సరం జిజా స్పెషల్ ఎడిషన్‌కు సంబంధించిన అద్భుతమైన విజయాన్ని అనుసరించి మాగ్నైట్‌కు సంబంధించిన సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రీమియం ఫీచర్లను అందించడానికి మార్కెట్లోని కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ కారును లాంచ్ చేశామని వివరించారు. 

మెగ్నైట్ జీజా సీవీటీ 1.0 ఎల్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికతో మాత్రమే అందిస్తున్నారు. ఇది 98.63 బీహెచ్‌పీ, 160 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ కారులో గెజా బ్యాడ్జింగ్, లేత గోధుమరంగు సీటు అష్టోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, మార్గదర్శకాలతో వెనుక కెమెరా, వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. మెగ్నైట్ జీజా సీవీటీ  స్పెషల్ ఎడిషన్ అనేది మార్కెట్లో ఏ ఇతర ఉత్పత్తి ఆఫర్ చేయని ఫీచర్లతో ఇంత పోటీ ధరలో లభించే ఏకైక సీవీటీ టర్బోగా నిలుస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి