ICICI Fixed Deposits: ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్.. మొబైల్ యాప్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్వీకరణకు ఛాన్స్..!
ఫిక్స్‌డ్ డిపాజిట్లను వేయడానికి బ్యాంకుల్లో నిర్ధిష్ట విధానాన్ని పాటించాలి. కచ్చితంగా బ్యాంకు శాఖకు వెళ్లి సంబంధిత పత్రాలను సమర్పించాలి. దీంతో హోమ్ బ్రాంచ్ ఓ చోట, ఉద్యోగం మరోచోట చేసేవారు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ మొబైల్ యాప్ ద్వారా డిపాజిట్లను సేకరించేందుకు ముందుకు వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఆ బ్యాంకుకు ఐ మొబైల్ పే యాప్ సహాయంతో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సాధారణంగా మనం కష్టపడి సంపాదించే సొమ్మును మంచి రాబడి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. బ్యాంకులు కూడా ఖాతాదారుల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లను సేకరించడానికి మంచి వడ్డీను ఆఫర్ చేస్తాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లను వేయడానికి బ్యాంకుల్లో నిర్ధిష్ట విధానాన్ని పాటించాలి. కచ్చితంగా బ్యాంకు శాఖకు వెళ్లి సంబంధిత పత్రాలను సమర్పించాలి. దీంతో హోమ్ బ్రాంచ్ ఓ చోట, ఉద్యోగం మరోచోట చేసేవారు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ మొబైల్ యాప్ ద్వారా డిపాజిట్లను సేకరించేందుకు ముందుకు వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఆ బ్యాంకుకు ఐ మొబైల్ పే యాప్ సహాయంతో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి యాప్ ద్వారా ఎలా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
ఐ మొబైల్ యాప్ ద్వారా డిపాజిట్ ఇలా
- మీ వేలిముద్ర లేదా పిన్ ఉపయోగించి ఐమొబైల్ యాప్ ద్వారా లాగిన్ చేయాలి.
- అనంతరం మీరు ‘ఖాతాలు-డిపాజిట్లు’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- ‘డిపాజిట్స్ (ఎఫ్‌డీ/ఆర్‌డీ)’పై క్లిక్ చేయండి.
- ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడానికి ‘ఓపెన్ ఎఫ్‌డీ’పై క్లిక్ చేయాలి.
- అక్కడ తప్పనిసరిగా డిపాజిట్ మొత్తాన్ని నమోదు చేయాలి.
- ఆ తర్వాత, మీరు తప్పనిసరిగా పెట్టుబడి వ్యవధిని ఎంచుకోవాలి.
- ‘వడ్డీ చెల్లింపు’ ఎంపికను ఎంచుకోవాలి.
- తర్వాత, పెట్టుబడి మొత్తం డెబిట్ చేసే ‘డెబిట్ ఖాతా’ని ఎంచుకోండి.
- మీరు ‘ఆటో రెన్యువల్’ని ఎంచుకోవచ్చు.
- ఆపై ‘సమర్పించు’పై క్లిక్ చేయాలి.
- వివరాలను సమీక్షించాలి.
- అనంతరం ‘సమర్పించు’పై క్లిక్ చేస్తే మీ ఎఫ్‌డీ ఖాతా ఓపెన్ అవుతుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ప్రయోజనాలు
- ఎఫ్‌డీల వల్ల మీ నిధులను సురక్షితంగా ఉంటాయి. అలాగే అధిక రిటర్న్‌లను అందిస్తాయి.
- ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై హామీతో కూడిన రాబడిని అందిస్తాయి,. అలాగే వాటిని సురక్షితంగా ఉంచుతాయి.
- పదవీకాల ఎంపికలపై విస్తృత శ్రేణిను అందిస్తాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం
