Home Loan: హోమ్ లోన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు

ముఖ్యంగా ప్రతి నెలా అద్దె కట్టే బదులు సొంతింటి ఈఎంఐ కట్టడం మేలని చాలా మంది హోమ్ లోన్లను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే హోం లోన్ విషయంలో వీలైనంత త్వరగా మీకు డబ్బు ఇవ్వగల బ్యాంకు కోసం మాత్రమే కాకుండా తక్కువ వడ్డీ రేటును వసూలు చేసే బ్యాంకు కోసం వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ రేటు విషయంలో రుణ గ్రహీతలు ఆలోచిస్తూ ఉంటారు.

Home Loan: హోమ్ లోన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు
Home Loan2
Follow us

|

Updated on: Apr 27, 2024 | 4:25 PM

సొంతిల్లు అనేది ప్రతి మధ్య తరగతి ఉద్యోగి కల. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి తాము పొదుపు చేసుకున్న సొమ్ముతో పాటు రుణం తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి నెలా అద్దె కట్టే బదులు సొంతింటి ఈఎంఐ కట్టడం మేలని చాలా మంది హోమ్ లోన్లను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే హోం లోన్ విషయంలో వీలైనంత త్వరగా మీకు డబ్బు ఇవ్వగల బ్యాంకు కోసం మాత్రమే కాకుండా తక్కువ వడ్డీ రేటును వసూలు చేసే బ్యాంకు కోసం వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ రేటు విషయంలో రుణ గ్రహీతలు ఆలోచిస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏయే బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేటుతో హోం లోన్లను ఇస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 

అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన గృహ రుణంపై సంవత్సరానికి 9.4 నుండి 9.95 శాతం వరకు వడ్డీ రేటుతో రుణాలను అందిస్తుంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణగ్రహీతకు సంబంధించిన సిబిల్ స్కోర్ ఆధారంగా 9.15 శాతం నుంచి 9.75 శాతం వరకు వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఈ రేట్లు మే 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఐసీఐసీఐ బ్యాంక్ 

ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ 9.40 శాతం నుంచి 10.05 శాతం వరకు వడ్డీ రేట్ల వద్ద గృహ రుణాన్ని అందిస్తుంది. ఈ వడ్డీ ఈఎంఐ వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. 

కోటక్ మహీంద్రా బ్యాంక్ 

ప్రైవేట్ రుణదాత జీతం పొందే వ్యక్తులకు 8.7 శాతం, స్వయం ఉపాధి రుణగ్రహీతలకు 8.75 శాతం గృహ రుణాలను అందిస్తుంది.

పీఎన్‌బీ హౌసింగ్ 

పీఎన్‌బీ ఫైనాన్స్ రెండు కారకాల ఆధారంగా 8.5 శాతం నుంచి 11.25 శాతం మధ్య వడ్డీ రేటును వసూలు చేస్తుంది. అంటే రుణగ్రహీత జీతం పొందారా? సిబిల్ స్కోర్ పరిధి ఆధారంగా 825 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్‌తో జీతం పొందే వ్యక్తులకు అత్యల్ప రేట్లు (8.5 నుండి 9 శాతం) అందించబడతాయి. అయితే జీతం లేని వారు 8.8 నుండి 9.3 శాతం వడ్డీ రేట్ల హోమ్ లోన్ అందిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!
కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!
అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి..
అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి..
ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..
ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..
గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్.. వీడియో
గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్.. వీడియో
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
అధిక వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కావాలా?
అధిక వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కావాలా?
ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా? అయితే మీకు క్యాన్సర్ వచ్చినట్టే!
ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా? అయితే మీకు క్యాన్సర్ వచ్చినట్టే!
ఆ రాశుల వారికి త్వరలో కష్టనష్టాల నుంచి విముక్తి..
ఆ రాశుల వారికి త్వరలో కష్టనష్టాల నుంచి విముక్తి..
వేసవిలో చందనం చేసే మ్యాజిక్స్ ఇవే.. డోంట్ మిస్!
వేసవిలో చందనం చేసే మ్యాజిక్స్ ఇవే.. డోంట్ మిస్!
ఆదివాసీల ఖిల్లా ఆదిపత్యం దక్కించుకునేది‌ ఎవరు.?
ఆదివాసీల ఖిల్లా ఆదిపత్యం దక్కించుకునేది‌ ఎవరు.?