Lok Sabha Election: సమయం లేదు మిత్రమా..! సార్వత్రి‌క సమరంలో గెలిచి నిలవాల్సిందే! పార్టీల ముప్పు తిప్పలు

సమయం లేదు మిత్రమా.. సార్వత్రిక ఎన్నికల సమరంలో సత్తాచాటాల్సిందే.. గెలిచి నిలవాల్సిందే.. అంటూ ఎర్రని ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో ఇప్పటికే అగ్రనేతల ప్రచారాలు పూర్తికావడంతో కీలక వ్యూహాలను అమలు చేస్తూ ఓటరు దేవుళ్లను తమవైపు తిప్పుకునేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు.

Lok Sabha Election: సమయం లేదు మిత్రమా..! సార్వత్రి‌క సమరంలో గెలిచి నిలవాల్సిందే! పార్టీల ముప్పు తిప్పలు
Brs Bjp Congress
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 09, 2024 | 4:48 PM

సమయం లేదు మిత్రమా.. సార్వత్రిక ఎన్నికల సమరంలో సత్తాచాటాల్సిందే.. గెలిచి నిలవాల్సిందే.. అంటూ ఎర్రని ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో ఇప్పటికే అగ్రనేతల ప్రచారాలు పూర్తికావడంతో కీలక వ్యూహాలను అమలు చేస్తూ ఓటరు దేవుళ్లను తమవైపు తిప్పుకునేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. గెలుపు బాధ్యతలు భుజానికెత్తుకున్న ఇంఛార్జ్‌లు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎన్నికల వ్యూహాల్లో తలమునకలవుతున్నారు.

కేవలం ప్రచారానికి మూడు రోజులు మాత్రమే సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.. సమయం లేదు మిత్రమా.. ఇక రణమే అంటూ దూసుకెళ్తున్నారు ప్రదాన పార్టీల నేతలు. ఇంతకీ ఆదివాసీల ఖిల్లా ఆదిపత్యం దక్కించుకునేది‌ ఎవరు.? ఏ సామాజికవర్గ ఓట్లు ఏ పార్టీ ఖాతాల్లోకి చేరే అవకాశాలు ఉన్నాయి..? కొత్తగా ఓటు హక్కును సాధించుకున్న యువ ఓటరు జై కొట్టెదెవరికి..? పార్లమెంటు పరిధిలోని అత్యధిక ఓట్లను కలిగి‌ ఉన్న మహిళా ఓటర్ల తీర్పు ఎటూ..? ఆదివాసీల ఖిల్లాలో సత్తాచాటే నేత ఎవరు..? మూడు రోజుల్లో ఎవరి తలరాతలు ఎంతలా మారనున్నాయి. ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.

ఆదిలాబాద్ ఆదివాసీల ఖిల్లా బరిలో ఉన్న ముగ్గురు నేతలు ఆదివాసీలే.. అందులోను గోండు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఉపాద్యాయులే. ఇప్పుడీ ముగ్గురికి గెలుపు తప్పని‌ సరి‌కావడంతో అభ్యర్థులు తీవ్రంగా చమటోడుస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటం.. ప్రచార వేగాన్ని మరింత పెంచారు. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారాలు పార్లమెంట్ పరిధిలో ప్రచారం పూర్తిచేశారు కూడా. అయితే బీజేపీ, బీఆర్ఎస్ లు మాత్రం ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని నమ్ముకుని ముందుకు సాగుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలు కట్టబెట్టిన అధికారంతో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతో భారీ ఆశలు పెట్టుకుంది. దీంతో మూడు పార్టీలు గెలుపు ఆశలు పెట్టుకోగా.. త్రిముఖ పోరులో ఎవరు గట్టెక్కుతారో అన్న చర్చ జోరుగానే సాగుతోంది.

అయితే ఆదివాసీ ఖిల్లా ఆదిలాబాద్ లో ఆరు నూరైనా తమ జెండా ఎగరేయాలన్న దృఢసంకల్పంతో ఉన్న కాంగ్రెస్ అదే తీరులో ప్రచారాలు కూడా కొనసాగిస్తోంది. గెలుపు బాధ్యతలు భుజానికెత్తుకున్న ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క.. తానే అభ్యర్థి అనే స్థాయిలో గడపగడపకు ప్రచారం చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆదిలాబాద్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఏకంగా మూడు సార్లు పార్లమెంట్ పరిధిలో పర్యటించి ఆదిలాబాద్ సీటు కాంగ్రెస్‌కు ఎంత అవసరమో చెప్పకనే చెప్పారు. ఏప్రిల్ 22న ఆదిలాబాద్ లో, మే 2న ఆసిఫాబాద్ లో, మే 5న రాహుల్ గాంధీ తో కలిసి నిర్మల్లో ముచ్చటగా మూడు బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాలతో కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

అయితే సిట్టింగ్ సీటును కాపాడుకోవడానికి బీజేపీ సైతం అదే స్థాయిలో దూసుకెళ్తుండటంతో ఆదిలాబాద్ గెలుపు హస్తానికి అంత సులువు కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మహిళా అభ్యర్థిని బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్లమెంటు పరిధిలో పురుష ఓటర్ల కంటే 40వేల ఆధిక్యంలో ఉన్న మహిళా ఓటర్లనే గంప గుత్తగా తమ వైపు తిప్పుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు కొత్తగా ఓటు హక్కును సాధించిన యువతను సైతం తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలలో కలిపి 2.50 లక్షల ఓట్లను మాత్రమే సాధించిన కాంగ్రెస్ మహిళా ఓటర్లు, యువ ఓటర్లు, పథకాలతో కలిసి వచ్చిన నూతన ఓటర్లు, ఆపరేషన్ ఆకర్ష్ తో కొత్తగా చేరిన కీలక నేతల బలం బలగంతో కలిపి మరో రెండు లక్షల ఓట్లు తమకు అదనంగా కలిసి వస్తాయని భావిస్తోంది కాంగ్రెస్‌.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు పూర్తికాకపోవడం గ్రామీణ ప్రాంతాల్లో కాస్త వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ.. అగ్రనేతల ప్రచారం.. ప్రత్యర్థి పార్టీల బలహీనతలు తమకు బలంగా మారుతాయని భావిస్తోంది కాంగ్రెస్. గత పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం పెరిగితే విజయం తమదే అన్న ధీమాను సైతం వ్యక్త పరుస్తోంది హస్తం పార్టీ.

2019లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 14,88,353 ఓటర్లు ఉండగా తాజాగా ఆ ఓట్ల సంఖ్య 16,50,175కి చేరడంతో పెరిగిన 1.12లక్షలకు పైగా ఓటర్లు గంపగుత్తగా మా వైపే నిలుస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే సొంత పార్టీలోనే అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉండటం చాపకింద నీరులా ఇన్‌ఛార్జీల వ్యవహారం పార్టీకి నష్టం చేస్తుండటం.. ఆపరేషన్ ఆకర్ష్ తో కలిసి వస్తుందనుకున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంకు సైలెంట్ గా మారడంతో ఓట్ల పండగలో తీర్పు ఎంత వైలెంట్ గా ఉంటుందోనన్న ఆందోళన కాంగ్రెస్ ను వెంటాడుతోంది.

కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంటే సిట్టింగ్ సీటును కాపాడుకునే సమరంలో బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. మోదీ హవాతో పక్కా గెలుస్తామని క్యాడర్ చెపుతున్నా.. అభ్యర్థి‌మార్పు కాస్త సంక్లిష్ట పరిస్థితుల్లో పడేసిందని తెలుస్తోంది. పార్లమెంట్ పరిదిలో కార్యకర్తల బలానికి లోటు లేకున్నా.. అసెంబ్లీ ఎనదనికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో.. బలం.. బలగం పెరిగినా.. నేతల మద్య సమన్వయ లోపం బీజేపీకి ఈ పార్లమెంట్ పరిధిలో నష్టం చేసే ఛాన్స్ ఉందన్న టాక్ నడుస్తోంది. బీజేపీ గెలుపును పక్కా చేసేందుకు కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో అమిత్ షా పర్యటించడంతో పార్టీలో మార్పు‌ వచ్చిందని తెలుస్తోంది.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పుతో ఏకంగా నాలుగు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని 4.48లక్షలకు పైగా ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న కాషాయ పార్టీ అదే జోష్ ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లోను కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఈ పార్లమెంట్ లో యువ ఓటర్లు కలిసి వస్తే విజయం సునాయాసమే అనే ధీమాతో ముందుకెళ్తుంది కాషాయ పార్టీ. ఆదిలాబాద్ పార్లమెంటులో 18 నుంచి 29ఏండ్ల ఓటర్లు 4,31,357 మంది ఉండగా.. మోదీ ఛరిష్మా కలిసి వచ్చి ఈ యువ ఓట్లలలో 80 శాతం తమకే పడుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. నూతన ఓటర్లు, యువ ఓటర్లు, సంప్రదాయ ఓటర్లతో కలిపి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 5 లక్షల ఓట్లను సంపాదించుకుని లక్ష మెజార్టీతో విజయం సాదిస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ.

అయితే బీజేపీ పార్టీ అభ్యర్థి గోడెం నగేష్ దూకుడుగా వ్యవహరించకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు.. ఎవరికివారే యమునా తీరే అన్నట్లు సాగుతుండటంతో.. కార్యకర్తల్లో ఆ స్థాయిలో జోష్ కనిపించడం లేదు. చార్ సౌ పార్.. ఫిర్ ఏక్బార్ మోడీ సర్కార్ అన్న ఒకే ఒక్క నినాదం కాషాయ క్యాడర్ ను లీడర్ ను ముందుకు నడిపిస్తుండగా.. గెలుపు బాద్యతలు భుజానికెత్తుకున్న నేతలు మాత్రం సమన్వయంతో సాగకపోవడం కాషాయానికి గడ్డుకాలాన్ని తెచ్చిపెడుతోంది.

ఇక నిన్న మొన్నటి వరకు ఫుల్ జోష్ లో కనిపించిన కారు పార్టీ అధికారం కోల్పోవడంతో ఆదిలాబాద్ పార్లమెంటు పరిదిలో ఆ స్థాయి జోష్ తో ప్రజల్లోకి వెళ్లలేకపోతోంది. కీలక నేతలు సైతం ఆదిలాబాద్ పార్లమెంటును లైట్ తీసుకోవడంతో బాధ్యతలన్నీ తన భుజానెత్తుకున్న మాజీ మంత్రి జోగు రామన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో కార్యకర్తల అండదండలతో వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో గెలిచి నిలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్‌లో కేటీఆర్ రోడ్ షోతో కార్యకర్తల్లో జోష్ నిండినా.. ఆపరేషన్ ఆకర్ష్ తో కోల్పోయిన క్యాడరు, లీడర్లను వారి వెంట వెళ్లిపోయిన ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకోవడం కారు పార్టీకి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో అంత సులువు కాదన్న భావనకు వచ్చేసింది బీఆర్ఎస్.

ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో కేవలం రెండు నియోజకవర్గాలను మాత్రమే గెలుచుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు చరిష్మా పైనే ఆధారపడి ముందుకు సాగుతోంది. ఆదివాసీల్లో అభ్యర్థికి మంచి పేరు ఉండటం గెలిచిన బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగకుండా పార్టీ గెలుపు కోసం శ్రమిస్తుండటం కలిసి వచ్చే అంశం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 4.65లక్షల ఓటు బ్యాంకును సంపాదించుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పటికే 1.50లక్షలకు పైగా ఓటు బ్యాంకును కోల్పోగా కొత్త ఓటర్లుగా తమ ఓటు హక్కును వినియోగించుకోబోయే 4లక్షలకు పైగా ఓటర్లలో కేవలం 20శాతం కూడా ఓటు బ్యాంకును రాబట్టుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉండటంతో ఆదిలాబాద్ సీటు గెలుపు కారు పార్టీకి గగనమే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో త్రిముఖ పోరు కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌లో లో సమన్వయ లోపం, బీఆర్ఎస్ లో నాయకత్వ లోపం గెలుపుపై ఆశలను సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఇటు బీజేపీలోనూ అసమ్మతి చాపకింద నీరులా కనిపిస్తున్నప్పటికీ నేతల కంటే దూకుడుగా కార్యకర్తలు గెలుపు బాధ్యతలు భుజానికెత్తుకోవడం కలిసి వచ్చే అంశం. బీజేపీకి అండదండగా నిలుస్తూ మూడోసారి మోదీ సర్కార్ రావాలన్న దృఢనమ్మకంతో హిందూ సంఘాలు బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తుండటం కూడా ఆ పార్టీ అవకాశాలను మెరుగుపరుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇటు బీజేపీలో పన్నా కమిటీలతో కమల దళం గల్లీ గల్లీలో ప్రచారం చేస్తుండటం.. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు క్రియాశీలక పాత్ర పోషిస్తుండటం మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈ కమిటీలు ఇంటింటికి చేరుస్తుండటం గ్రామాల్లో యువకులు, మేధావులు, రైతులు, మహిళలతో ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతుండటం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారుతోంది. కాంగ్రెస్ సైతం అదే స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ బాధ్యతలన్నీ ఇన్‌చార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ మాత్రమే మోయాల్సి వస్తుండటంతో ఎదురీదాల్సి వస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ నుండి గంప గుత్తగా పార్టీలో చేరిన కారు పార్టీ నేతలు ఇంకా కాంగ్రెస్ నాయకులమన్న ధీమాలోకి రాకపోవడం.. ఘర్ వాపసీని కొత్త నేతలు అడ్డుకోవడం కూడా మైనస్ గా ఉంది.

అయితే వంద రోజుల పాలనలో మహిళలు, యువత, పట్టణ ప్రాంత ఓటర్లు హస్తం కు మరొక్క అవకాశం ఇస్తే పోలా.. అన్న తీరును కనబరుస్తుండటం కాంగ్రెస్‌కు ఈ పార్లమెంట్ పరిదిలో కలిసి వచ్చే అంశం. అటు గ్రామీణ ప్రాంతాల్లోను బీజేపీకి జై కొడుతున్న ఓటర్ల సంఖ్య పెరుగుతుండటం కాషాయ దళానికి కలిసొచ్చే అంశం. ఇద్దరి ప్రభావంతో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో సంపాదించుకున్న ఓటు‌బ్యాంక్ ను కాపాడుకోవడం కష్టమే. చూడాలి మరీ.. ఈ లెక్కలన్నీ పక్కాగా అమలైతే.. గెలుపు మంత్రం తూచ తప్పకుండా సాగితే మార్పు తథ్యం. లేదంటే పాత నేతకే పట్టం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భారీగా పెరిగిన బ్యాంకింగ్ రంగం నికర లాభం.. పీఎం మోదీ కీలక ట్వీట్
భారీగా పెరిగిన బ్యాంకింగ్ రంగం నికర లాభం.. పీఎం మోదీ కీలక ట్వీట్
ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
రాజస్థాన్ ఓటమి, బెంగళూరు గెలుపు పక్కా..
రాజస్థాన్ ఓటమి, బెంగళూరు గెలుపు పక్కా..
యువతితో ఈ ఐదు గుణాలు చేసి పెళ్లి చేసుకోమంటున్న చాణక్య
యువతితో ఈ ఐదు గుణాలు చేసి పెళ్లి చేసుకోమంటున్న చాణక్య
ఈపీఎఫ్‌ డెత్ క్లెయిమ్ కోసం కొత్త నియమం.. ఈ అప్‌డేట్ చేసుకోండి
ఈపీఎఫ్‌ డెత్ క్లెయిమ్ కోసం కొత్త నియమం.. ఈ అప్‌డేట్ చేసుకోండి
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..