IPL 2024: హైదరాబాద్ చేతిలో దారుణ ఓటమి.. గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్.. వీడియో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం ( మే09) జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ బౌలర్లపై విరుచుకుపడిన ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు చేసి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు

IPL 2024: హైదరాబాద్ చేతిలో దారుణ ఓటమి.. గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్.. వీడియో
KL Rahul
Follow us

|

Updated on: May 10, 2024 | 9:08 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం ( మే09) జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ బౌలర్లపై విరుచుకుపడిన ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు చేసి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ గెలుపు పాట్ కమిన్స్ టీమ్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. అదే సమయంలో కేఎల్ రాహుల్ జట్లు ప్లే ఆఫ్ కలలపై నీళ్లు చల్లింది. ఇదిలా ఉంటే హైదరాబాద్- లక్నో మ్యాచ్ ముగిసిన తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ చేతిలో దారుణ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా సహనం కోల్పోయాడు. జట్టు ఆటతీరుపై గ్రౌండ్‌లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై సంజీవ్ మండిపడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను గమనించిన నెటిజన్లు మాత్రం వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని అంటున్నారు. మరోవైపు ఇలా పబ్లిక్ గా అందరి ముందు కేఎల్ రాహుల్ ను అవమానించడం తగదని అభిమానులు లక్నో ఓనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ రాహుల్ 33 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఆయుష్ బదోని 30 బంతుల్లో 55, నికోలస్ పూరన్ 26 బంతుల్లో 48 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఎస్ ఆర్ హెచ్ కు ఓపెనర్లు మెరుపు శుభారంభం అందించారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు, అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు చేయడంతో హైదరాబాద్ 9.4 ఓవర్లలో మరో 62 బంతులు మిగిలి ఉండగానే స్కోరును ఛేదించింది. ఈ విజయంతో, SRH ఆడిన 12 మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ఐదు పరాజయాలతో 14 పాయింట్లు సంపాదించి మూడవ స్థానానికి ఎగబాకింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్‌లు ఆడి కేవలం 12 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్లే-ఆఫ్‌లకు అర్హత సాధించడానికి వారు తమ రెండు మ్యాచ్‌లను గెలవాలి. అలాగే రన్ రేట్ కూడా భారీగా మెరుగుపడాలి. LSG ఇప్పటివరకు ఆడిన రెండు సీజన్‌లలో ప్లేఆఫ్‌లకు చేరుకుంది. 2022 2023 సీజన్లలో ఎలిమినేటర్‌ మ్యాచుల్లో ఆ జట్టు ఓడిపోయింది.

అప్పుడు ధోని. .ఇప్పుడు కేఎల్ రాహుల్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
10మంది టీమిండియా ఆటగాళ్లు ఔట్.. ప్లేఆఫ్స్ ఆడేది ఐదుగురే
10మంది టీమిండియా ఆటగాళ్లు ఔట్.. ప్లేఆఫ్స్ ఆడేది ఐదుగురే
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పులు.. ఎందుకంటే..
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పులు.. ఎందుకంటే..
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కా.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కా.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది
తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది
చరిత్ర సృష్టించిన SRH.. ఒక్కరోజులోనే ఆర్‌సీబీ రికార్డ్‌ బ్రేక్
చరిత్ర సృష్టించిన SRH.. ఒక్కరోజులోనే ఆర్‌సీబీ రికార్డ్‌ బ్రేక్
'బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నమ్మలేము'.. కాంగ్రెస్ సీనియర్ నేత..
'బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నమ్మలేము'.. కాంగ్రెస్ సీనియర్ నేత..
స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్స్‌.. అమెజాన్‌ సేల్‌లో ఏకంగా 80
స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్స్‌.. అమెజాన్‌ సేల్‌లో ఏకంగా 80
నీట మునిగిన పంటతో రైతు కంట కన్నీరు.. సాయం కోసం ఎదురు చూపులు..
నీట మునిగిన పంటతో రైతు కంట కన్నీరు.. సాయం కోసం ఎదురు చూపులు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..