పసిడి ప్రియులకు శుభవార్త..వేలల్లో తగ్గిన ధర.

పసిడి పరుగులకు తాత్కాలికంగా కళ్లెం పడింది. రికార్డు గరిష్టాలను నమోదు చేసిన పుత్తడి ధర ఇప్పుడు భారీగా దిగి వచ్చింది. దేశీయంగా పుత్తడి ధరలు క్షిణించాయి. గత కొద్ది రోజులుఉగా మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడం సామాన్యులను కలవరపెడుతోంది. పెళ్లి పెరంటాలు, శుభకార్యాలు, పండగ సమయాల్లో ఆచారం ప్రకారం కాస్తో కూస్తో బంగారం కొనుగోళు చేద్దామన్నా.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి పరిస్థితి నెలకొంది. ఇటువంటి టైమ్‌లోనే హైదరాబాద్‌ మార్కెట్‌లో గురువారం ఒక్క రోజులోనే పది […]

పసిడి ప్రియులకు శుభవార్త..వేలల్లో తగ్గిన ధర.

Updated on: Aug 16, 2019 | 5:08 PM

పసిడి పరుగులకు తాత్కాలికంగా కళ్లెం పడింది. రికార్డు గరిష్టాలను నమోదు చేసిన పుత్తడి ధర ఇప్పుడు భారీగా దిగి వచ్చింది. దేశీయంగా పుత్తడి ధరలు క్షిణించాయి. గత కొద్ది రోజులుఉగా మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడం సామాన్యులను కలవరపెడుతోంది. పెళ్లి పెరంటాలు, శుభకార్యాలు, పండగ సమయాల్లో ఆచారం ప్రకారం కాస్తో కూస్తో బంగారం కొనుగోళు చేద్దామన్నా.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి పరిస్థితి నెలకొంది. ఇటువంటి టైమ్‌లోనే హైదరాబాద్‌ మార్కెట్‌లో గురువారం ఒక్క రోజులోనే పది గ్రాముల 24 క్యారెట్‌ బంగారం ధర ఏకంగా రూ. 2,490 రూపాయలకు తగ్గింది. దీంతో  ఇవాళ్టి బంగారం ధర రూ. 37,000కు పతనమైంది.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 360 తగ్గి,  రూ.35, 760కి దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్‌ ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ఇన్వెస్టర్ల అమ్మకాలు, జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 1.29 శాతం పెరుగుదలతో 1,532.15 డాలర్లకు చేరింది. అదే సమయంలో వెండి ధర ఔన్స్‌ 0.28 శాతం పెరుగుదలతో 17.32 డాలర్లకు ఎగసింది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ. 47, 265 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇటు దేశరాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 300 క్షీణించి రూ. 37, 700 వద్ద ఉంది. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గి రూ.36,500 వద్ద ఉంది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా రూ.47, 265 వద్ద కొనసాగుతోంది.