మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా పొలం పనులతో పాటు సరుకు రవాణా విషయంలో కూడా ట్రాక్టర్లు అవసరం అవుతున్నాయి. ముఖ్యంగా వరిసాగు ట్రాక్టర్లు తప్పనిసరిగా మారాయి. అయితే భారతదేశంలో ఎక్కువ మంది చిన్నసన్నకారు రైతులు ఉండడం వల్ల ట్రాక్టర్ల కొనుగోలు వారికి తలకు మించిన భారంగా మారాయి. రైతుల అన్ని అవసరాలకు ఉపయోగపడేలా కంపెనీలు కూడా హై పవర్ ట్రాక్టర్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ట్రాక్టర్లు అవసరం ఉన్న చిన్న సన్నకారు రైతులు మాత్రం ట్రాక్టర్ కొనుగోలు వెనుకాడుతున్న పరిస్థితి. తమకు అందుబాటు ధరలో ఉండేలా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ మహీంద్రా కంపెనీకి చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ కొత్త శ్రేణి కాంపాక్ట్ లైట్ వెయిట్ ట్రాక్టర్‌లను విడుదల చేసింది. వీటి ధర రూ. 5.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కొత్త టార్గెట్ రేంజ్ కింద 20-30 హెచ్‌పీ కేటగిరీలో టార్గెట్ 630, టార్గెట్ 625 అనే రెండు మోడళ్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సూపర్ లైట్ ట్రాక్టర్ల ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
కొత్త స్వరాజ్ టార్గెట్ శ్రేణి శక్తి, అధునాతన సాంకేతిక లక్షణాలను సజావుగా మిళితం చేస్తుంది. స్ప్రేయింగ్, అనేక ఇతర అప్లికేషన్‌లలో అసాధారణమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. స్వరాజ్ టార్గెట్ పరిచయం చేసిన తర్వాత స్వరాజ్ ట్రాక్టర్ల వృద్ధిలో కొత్త అధ్యయనం ప్రారంభం అవుతుందన,ి మార్కెట్ నిపుణుల అంచనా. ముఖ్యంగా ఈ ట్రాక్టర్లు హార్టికల్చర్‌లో యాంత్రీకరణను సులభతరం చేస్తుందని పేర్కొంటున్నారు. ఎందుకంటే 15హెచ్‌పీ నుంచి ఈ ట్రాక్టర్ల శ్రేణి ప్రారంభం అవుతుంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌తో, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి కొత్త వ్యవసాయ ఉత్పాదకతలో వారి లక్ష్యాలను సాధించడంలో రైతులకు సహాయపడుతుందని పేర్కొంటున్నారు. మహీంద్రా గ్రూప్ వ్యవసాయ పరికరాల రంగం గురువారం మొత్తం విక్రయాల్లో 4 శాతం క్షీణతతో మేలో 34,126 యూనిట్లకు పడిపోయింది. గత ఏడాది మేలో 35,722 యూనిట్లు విక్రయించారు. దేశీయ ట్రాక్టర్ల విక్రయాలు 3 శాతం క్షీణించి 33,113 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 34,153 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే ట్రాక్టర్ ఎగుమతులు కూడా మే 2022లో 1,569 యూనిట్ల నుంచి 35 శాతం తగ్గి 1,013 యూనిట్లకు చేరుకున్నాయని ఎంఅండ్ఎం తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి