IT Company Gift: ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్‌.. సంబరాల్లో మునిగి తేలుతున్న ఉద్యోగులు

|

Apr 27, 2023 | 5:31 PM

ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలను తొలగిస్తూ ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా కంపెనీల్లో తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ కంపెనీ తమ ఉద్యోగులను తొలగిస్తుందో తెలియని పరిస్థితి..

IT Company Gift: ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్‌.. సంబరాల్లో మునిగి తేలుతున్న ఉద్యోగులు
IT Employees
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలను తొలగిస్తూ ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా కంపెనీల్లో తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ కంపెనీ తమ ఉద్యోగులను తొలగిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు చేస్తున్నవారికి రోజు దినదిన గండంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌, మైక్రోస్టాఫ్‌ట్‌, గూగుల్‌, అమెజాన్‌, మెటా తదితర టెక్‌ దిగ్గజాలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టెక్‌ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్‌ను ప్రకటించింది. ఏకంగా కంపెనీలో పని చేస్తున్న 21 వేల మంది ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌ను ప్రకటించింది.

ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీ కోఫోర్జ్‌ దాని క్యూ4 ఆదాయాలలో లాభాల బాటలో నడిచింది. ఒక బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సాధించిన నేపథ్యంలో కంపెనీలో మొత్తం 21 వేల మంది ఉద్యోగులకు యాపిల్‌ ఐపాడ్‌ను గిఫ్ట్‌గా అందిస్తుంది. దీని కోసం మొత్తం రూ.80.3 కోట్లు కేటాయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంవత్సరం మార్చి 31 నాటికి సేల్స్‌, మార్కెటింగ్‌ సిబ్బంది తదితరులను మినహాయించి మొత్తం కంపెనీలో 21,815 మంది ఉద్యోగులు ఉన్నారు.

త్రైమాసికంలో తమ కంపెనీ రెండు కీలక విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. మొదటి త్రైమాసికంలో 5 శాతం వృద్ధి, రెండోది బిలియన్‌ డాలర్ల మార్క్‌ ఆదాయాన్ని అధిగమించినట్లు కోఫోర్జ్‌ సీఈవో సుధీర్‌సింగ్‌ పేర్కొన్నారు. 2024లో కూడా ఇదే విధంగా వృద్ధి కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

గత సంవత్సరం రూ.1,742 కోట్లుగా ఉన్న కోఫోర్జ్‌ కంపెనీ గ్రాస్‌ రెవెన్యూ మార్చి 31తో ముగిసిన క్యూ4లో 24.5 శాతం పెరిగి రూ.2,170 కోట్లకు చేరింది. అయితే నికర లాభం క్యూ4లో 48.08 శాతం తగ్గి రూ.116.7 కోట్లుగా ఉంది. గత సంవత్సరం అది రూ.224.8 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెర్టికల్ పై సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలడం, గ్లోబల్ బ్యాంకింక్ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపలేదని కంపెనీ వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి