MG Comet EV: దూసుకొచ్చిన బుల్లికారు.. మార్కెట్లో టాటా టియాగోతోనే అసలైన పోటీ.. ఏది బెస్ట్?
ఇప్పుడు ఎంజీ కామెట్, టాటా టియాగో మధ్య మార్కెట్లో పోటీ వాతావరణం ఏర్పడుతోంది. రెండూ తక్కువ ధరలోనే లభ్యమవుతుండటంతో వాటిలో అందుబాటులో ఉన్న ఫీచర్లు, మైలేజీ, బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, బాడీ టైప్ వంటి అంశాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల రంగంలో పోటీ వాతావరణం ఉంది. అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నప్పటికీ వాటి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటి వరకూ వినియోగదారులకు అందుబాటులో ధరలో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో. కానీ అదే రేంజ్ లో అంతకుమించిన ఫీచర్లతో ఎంజీ ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును మన దేశంలో లాంచ్ చేసింది. ఎంజీ కామెట్ పేరిట పట్టణ ప్రజల అవసరాలకు తీర్చేందుకు గానూ చిన్న కుటుంబాలకు ఉపయోగపడేలా దీనిని ఆవిష్కరించింది. ఇది ఎంజీ మోటార్ ఇండియా నుంచి రెండో ఎలక్ట్రిక్ కారు. ఇప్పుడు ఎంజీ కామెట్, టాటా టియాగో మధ్య మార్కెట్లో పోటీ వాతావరణం ఏర్పడుతోంది. రెండూ తక్కువ ధరలోనే లభ్యమవుతుండటంతో వాటిలో అందుబాటులో ఉన్న ఫీచర్లు, మైలేజీ, బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, బాడీ టైప్ వంటి అంశాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ధరల్లో వ్యత్యాసం..
టాటా టియోగో ధర, రేంజ్ విషయాలు ఓసారి చూస్తే టియాగో ఈవీ ఎక్స్ఈ ఎంఆర్ ధర రూ. 8.69లక్షలు ఎక్స్ షోరూం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే టియాగో ఈవీ ఎక్స్ జెడ్ ప్లస్ ఎల్ ఆర్ వేరియంట్ రూ. 11.49 లక్షల వరకూ ఉంటుంది. అదే ఎంజీ కామెట్ ధర రూ. 7.98 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది సింగిల్ వేరియంట్ గానే అందుబాటులో ఉండనుంది. అయితే వినియోగదారులు అదనపు ఫీచర్లు, యాక్సెసరీస్, గ్రాఫిక్స్ వంటివి కావాలనుకొంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టాటా టియాగో ధర విషయంలో ఎంజీ కామెట్ కంటే ఎక్కువే ఉంది.
రేంజ్..
టాటా టియాగో, ఎంజీ కామెట్ మధ్య రేంజ్ విషయంలో పెద్ద తేడా ఏమి లేదు. టాటా టియాగోలో బ్యాటరీ సామర్థ్యం కొంచె ఎక్కువ కనిపిస్తోంది. దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 300కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించుకుంది. అదే సమయంలో ఎంజీ కామెట్ రేంజ్ కూడా దీనికి కాస్త దగ్గరలోనే ఉంది. బ్యాటరీ సామర్థ్యం కొంచెం తక్కువగా ఉంది. కానీ సింగిల్ చార్జ్ పై 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
కంఫర్ట్ విషయంలో..
వినియోగదారుల కంఫర్ట్ విషయంలో టాటా టియాగో పై చేయి సాధించే అవకాశం ఉంది. ఈ కారు డైమెన్షన్లలో ఎంజీ కామెట్ ఈవీ కంటే పెద్దదిగా ఉంటుంది. సులభంగా ఐదుగురు ప్రయాణించే వీలుంది. ఎంజీ కామెట్ కేవలం మూడు మీటర్ల కన్నా తక్కువ పొడవుతో ఉంటుంది. దీనిలో నలుగురు ప్రయాణించే వీలుంటుంది. పైగా దీనిలో రెండే డోర్లు ఉంటాయి. దీనిని ప్రధానంగా సిటీ అవసరాలకు, చిన్న కుటుంబాలకు అనువైనది మార్కెట్లోకి లాంచ్ చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..