భారతదేశంలో బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందాక ప్రజలు బ్యాంకులను కూడా ప్రముఖ పెట్టుబడి సాధనంగా భావించి పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి పథకాల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. ఎఫ్‌డీ పథకాల్లో నమ్మకమైన రాబడితో పాటు పెట్టుబడికి భరోసా ఉండడంతో రిస్క్ ఎదుర్కొలేని పెట్టుబడిదారులు ఎఫ్‌డీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో బ్యాంకుల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో కొన్ని బ్యాంకులుప్రత్యేక ఎఫ్‌డీ పథకాల ద్వారా బ్యాంకులు నిర్ణీత కాల డిపాజిట్లపై అధిక వడ్డీను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఆర్‌బీఎల్ బ్యాంక్ రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు జూలై 29, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ పొదుపు ఖాతా వడ్డీ రేట్లను కూడా సవరించింది. కొత్త రేట్లు జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఎల్ బ్యాంకు అందించే వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆర్‌బీఎల్ బ్యాంక్ 500 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై అత్యధికంగా 8.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనంగా వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లకు దాదాపు 8.60 శాతం వడ్డీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.85% అదనపు వడ్డీ అందిస్తుంది. అలాగే 241 రోజుల నుంచి 364 రోజుల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.05 శాతం వడ్డీ అందిస్తే సీనియర్ సిటిజన్లకు 6.55 శాతం వడ్డీను అందిస్తుంది. 365 రోజుల నుంచి 452 రోజుల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.00 శాతం వడ్డీను అందిస్తుంది. 453 రోజుల నుంచి 499 రోజుల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8.30 శాతం వడ్డీ అందించగా, సాధారణ ప్రజలకు 7.80 శాతం వడ్డీ అందిస్తుంది. అలాగే 546 రోజుల నుంచి 24 నెలల డిపాజిట్లపై సాధారణ 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వడ్డీ అందిస్తుంది.
ఆర్‌బీఎల్ బ్యాంక్ పొదుపు ఖాతాల్లో లక్ష కంటే ఎక్కువ రోజువారీ నిల్వలపై వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 7.75 శాతం వరకు అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి