భారతదేశంలో స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబడి పథకమంటే ఫిక్స్‌డ్ డిపాజిట్స్ అనే విషయం టక్కున గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు రిటైరయ్యాక ఒకేసారి వచ్చిన డబ్బును కచ్చితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడి పెడతారు. అలాగే సాధారణ ప్రజలు కూడా పెట్టుబడికి భరోసాతో పాటు రాబడికి హామీ ఉంటుందనే నమ్మకంతో ఎఫ్‌డీలను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల ఖాతాదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు కూడా పోటీపడుతూ మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఈ వడ్డీ రేట్ల సవరణ అక్టోబర్ 3, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వడ్డీ రేట్ల సవరణ సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజన్‌లకు ఆకర్షణీయమైన ఎంపికలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఆఫ్ బరోడా తాజా వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
రూ. 3 కోట్ల కంటే తక్కువ ఎన్ఆర్ఓ డిపాజిట్లతో సహా దేశీయ టర్మ్ డిపాజిట్లకు కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంకు ఇటీవల తన ప్రకటనలో పేర్కొంది. 7 నుంచి 14 రోజుల వరకు స్వల్పకాలిక డిపాజిట్ల కోసం నివాసితులు 4.25 శాతం వడ్డీను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కాలవ్యవధికి సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం వడ్డీ వస్తుంది. పదవీకాలం పెరిగేకొద్దీ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. సీనియర్ సిటిజన్లు వివిధ కాల వ్యవధిలో అధిక రాబడి నుండి ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు 1 నుంచి 2 సంవత్సరాల మధ్య డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంటే సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీను అందిస్తుంది. సవరించిన రేట్లు సీనియర్ సిటిజన్‌లకు అదనపు వడ్డీని కలిగి ఉంటాయి. మూడు సంవత్సరాల వరకు డిపాజిట్‌లకు 0.50 శాతం అదనపు వడ్డీ, ఎక్కువ కాలం ఉన్నవారికి అధిక రేట్లు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..