కేంద్ర ప్రభుత్వం గత నెలలో డీఏ, డీఆర్‌లలో 4 శాతం పెంపును ప్రకటించినప్పటికీ ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. అయితే వారు ఇప్పుడు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఇస్తారు. జనవరి, జూలై నుండి అమల్లోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు డీఏ, డీఆర్ పెంచుతారు. డీఏ పెంపును ప్రకటించిన ప్రభుత్వం గత నెలలో మార్చి నెల జీతాల పంపిణీకి ముందు బకాయిలు చెల్లించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఏ, డీఆర్ పెంపునకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
మార్చి 7న కేంద్ర కేబినెట్ డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో 4 శాతం పెంపును ప్రాథమిక వేతనంలో 50 శాతానికి పెంచింది. కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే 4 శాతం డీఏ పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చింది. ఇది కాకుండా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెంచారు. డీఏ పెంపు వల్ల ఖజానాపై రూ.12,868 కోట్ల భారం పడనుంది. అక్టోబర్ 2023లో మునుపటి డీఏ పెంపులో ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను 4 శాతం నుండి 46 శాతానికి పెంచిన విషయం విధితమే.
ప్రభుత్వం 4 శాతం డీఏ పెంపును ప్రకటించినందున ఒకరి జీతం నెలకు రూ. 50,000 అనుకుంటే అందులో ఉద్యోగి ప్రాథమిక వేతనంగా రూ. 15,000గా ఉంటుంది. అతను లేదా ఆమె ప్రస్తుతం మూల వేతనంలో 46 శాతం అంటే రూ.6,900 పొందుతున్నారు. అయితే 4 శాతం పెంపు తర్వాత ఉద్యోగి నెలకు రూ. 7,500 పొందుతారు, ఇది అంతకుముందు రూ.6,900తో పోలిస్తే రూ.600 ఎక్కువ. కాబట్టి ఎవరైనా నెలకు రూ. 50,000 జీతంతో రూ. 15,000 బేసిక్ పేగా ఉంటే, అతని లేదా ఆమె జీతం నెలకు రూ.600 పెరుగుతుంది.
ఆల్-ఇండియా సీపీఐ-ఐడబ్ల్యూకు సంబంధించిన 12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా డీఏ, డీఆఱ్ పెంపు నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీలలో అలవెన్సులను సవరించినప్పటికీ నిర్ణయం సాధారణంగా మార్చి మరియు సెప్టెంబర్/అక్టోబర్‌లలో ప్రకటిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి