భారతదేశంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ద్విచక్ర వాహన వినియోగం తారాస్థాయికు చేరింది. ముఖ్యంగా యువత ఎక్కువ సంఖ్యలో ద్విచక్ర వాహనాలను డ్రైవ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ రంగంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నానుడి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు సరిగ్గా సరిపోతుంది. భారతదేశంలోని ఉన్నత వర్గాలు రాయల్ ఎన్‌ఫీల్డ్ వచ్చిన కొత్త వీటిని కొనుగోలు చేసేవారు. వీటిపై ప్రయాణిస్తే ఓ హోదాలా ఫీలయ్యేవారు. ముఖ్యంగా ఈ బైక్ నుంచి వచ్చే బీటింగ్ సౌండ్‌కు అందరూ మంత్రముగ్గులవుతారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతా.. పా’ లాంటి పాటలు చూస్తే ఈ బైక్స్‌పై ఉన్న క్రేజ్ అర్థం అవుతుంది. అయితే వీటి ధర అధికంగా ఉండడంతో కేవలం ఉన్నత శ్రేణి వర్గాలు మాత్రమే వీటిని కొనుగోలు చేసేవారు. క్రమేపి రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కూడా ధరలు తగ్గించి అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. అయినా అవి సామాన్యుడు భరించేలా లేవు. అలాంటి వారు బుల్లెట్ బండిపై రైడ్ చేయాలని కోరుకుంటారు. సరిగ్గా ఇలాంటి వారి కోసమే రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ సరికొత్త రెంటల్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే అద్దె చెల్లించి మనం బుల్లెట్ బండిపై రైడ్ చేయవచ్చు. ఈ తాజా రెంటల్ ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో తన మోటార్ సైకిల్ రెంటల్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రామ్‌కు రాయల్ ఎన్ఫీల్డ్ రెంటల్ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని 25 నగరాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్స్‌ను అద్దెలకు అందిస్తుంది. 40కి పైగా మోటార్‌సైకిల్ అద్దె ఆపరేటర్‌లతో సహకరిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ రెంటల్ 300 కంటే ఎక్కువ మోటార్‌సైకిళ్లను అద్దెకు అందుబాటులో ఉంచుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ రెంటల్ ప్రస్తుతం అహ్మదాబాద్, ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, చండీగఢ్, ధర్మశాల, లేహ్, మనాలి, హరిద్వార్, రిషికేశ్ వంటి నగరాల్లో అందుబాటులో ఉంటుంది. త్వరలో ఈ మోటార్‌సైకిల్ అద్దె సేవలను ఉదయపూర్, జైపూర్, జైసల్మేర్, గోవా, కొచ్చి, భువనేశ్వర్, తిరువనంతపురం, విశాఖపట్నం, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిమ్లా, నైనిటాల్, బిర్ బిల్లింగ్, సిలిగురి మరియు డెహ్రాడూన్‌లకు విస్తరించనున్నారు.
రాయల్‌ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను అద్దెకు తీసుకోవడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడు మీకు మోటార్ సైకిల్ అవసరమైన నగరాన్ని ఎంచుకోండి. తర్వాత పిక్-అప్, డ్రాప్-అప్ తేదీలతో పాటు సమయాన్ని ఎంచుకోవాలి. ఈ వెబ్‌సైట్ మీకు అందుబాటులో ఉన్న మోడల్‌లు, వాటి ధరలను చూపుతుంది. మీరు ఫారమ్‌ను పూరించడం ద్వారా ఆపరేటర్ వివరాలను పొందవచ్చు. ఆపరేటర్ ద్వారా రీఫండబుల్ ఛార్జ్ ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ రెంటల్స్ చొరవ, రైడర్‌లు భారతదేశంలో ఎక్కడైనా మోటార్‌సైకిల్‌ను అద్దెకు తీసుకునేందుకు యాక్సెస్‌ను కల్పిస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో ఈ సేవలను మరింత విస్తరిస్తామని వివరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..