
గుడ్ ఫ్రైడే సమీపిస్తున్న కొద్దీ చాలా మంది బ్యాంక్ కస్టమర్లు ఏప్రిల్ 18, 2025న శాఖలు తెరిచి ఉంటాయా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల షెడ్యూల్ ప్రకారం.. త్రిపుర, అస్సాం, రాజస్థాన్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయి.
యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గుర్తుచేసుకునే క్రైస్తవ సెలవుదినం గుడ్ ఫ్రైడే రోజు బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, SMS బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, ATM సేవలు వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఈ సేవన్ని అందుబాటులో ఉంటాయి.
RBI ప్రాంతాల వారీగా క్యాలెండర్ ప్రకారం, ఏప్రిల్ 2025 బ్యాంకు సెలవుల జాబితా గురించి తెలుసుకుందాం. అయితే ఈ సెలవులన్ని కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలపై ఆధార పడి ఉంటుందని గుర్తించుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి