Gold ATM: ఏటిఎం అంటే సహజంగా.. డబ్బు విత్‌డ్రా(Cash Withdrawal) చేసుకునేందుకు లేదా ఎవరికైనా డబ్బు పంపించేందుకు వినియోగిస్తుంటాం. కానీ.. డబ్బు విత్‌డ్రాయల్స్, జమ చేసేందుకు వినియోగించే ఏటీఎంల తరహాలోనే బంగారం కోసం కూడా ఏటీఎంలు దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. గోల్డ్ సిక్కా సంస్థ(Goldsikka Company) ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. రానున్న నెలన్నర కాలంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ముందుగా వీటిని హైదరాబాద్ నగరంలోని చార్మినార్, సికింద్రాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో మెుదటివిడతగా బంగారు ఏటిఎంలను ప్రరంభిస్తోంది. వీటి నుంచి ఏకకాలలంలో 0.50 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని సంస్థ సీఈవో తరుజ్ వెల్లడించారు.
ఈ ఏటిఎంల నుంచి బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా కంపెనీ అందిస్తున్న ప్రీపెయిడ్ కార్డులను ఇందుకోసం వినియోగించుకోవలసి ఉంటుంది. బంగారం స్వచ్ఛతకు సంబంధించిన వివరాలన్నింటితో ప్యూరిటీ సర్టిఫికెట్ కూడా కొనుగోలు సమయంలోనే పొందవచ్చని తరుజ్ వెల్లడించారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన 5 కేజీల బంగారు కాయిన్లను లోడ్ చేయవచ్చని సంస్థ వెల్లడించింది. భారత్‌లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 వరకు ఈ గోల్డ్ ఏటీఎంలు పనిచేయనున్నాయి. ప్రస్తుతం ఇటువంటి ఏటిఎంలు దుబాయ్, బ్రిటన్లో మాత్రమే ఉన్నాయి.
ఇవీ చదవండి..
Crude Oil: రష్యా ఆఫర్ కు భారత చమురు కంపెనీలు ఫిదా.. భారీగా ముడి చమురు దిగుమతికి ఆర్డర్లు..
Gold Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు