రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధర పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పెరుగుతోన్న క్రూడ్ ఆయిల్ ధరే ఇందకు కారణం. రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర మరింత పెరుగుతుందని బ్రోకరేజ్ కంపెనీ గోల్డ్‌మన్ సాచ్స్ చెప్పారు.
రానున్న కాలంలో క్రూడ్ ఆయిల్‌కు డిమాండ్ పెరుగుతుందని, ధరలు ప్రస్తుత స్థాయి కంటే పైకి కదులుతాయని బ్రోకరేజ్ హౌస్ అంచనా వేస్తోంది. ముడి చమురు డిమాండ్ 2022-2023లో దాని కొత్త రికార్డు స్థాయిని తాకవచ్చు. దీని కారణంగా ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఉంది. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బ్రోకరేజ్ హౌస్ సీనియర్ అధికారి ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కోలుకోవడం ప్రారంభిస్తున్నాయని చెప్పారు. రానున్న కాలంలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య అంతరం ఏర్పడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. .
ఇటీవల, డిమాండ్ విజృంభణ కారణంగా, బ్రెంట్, WTI క్రూడ్ బ్యారెల్‌కు 80 డాలర్లు దాటింది. ఒమిక్రాన్ భయంతో ధర బ్యారెల్ 70 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఒమిక్రాన్ డెల్టా కంటే తీవ్రమైనది కాదని తెలియడంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. కమోడిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే కాలంలో డిమాండ్ పెరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో భారతదేశంలో దానిపై విధించే సుంకం ద్వారా ధరలు ఉంటాయి. విదేశీ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగితే దేశీయ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు. అయితే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో రానున్న కాలంలో ప్రభుత్వం పన్నును నియంత్రించి వినియోగదారులపై ఒత్తిడిని పరిమితం చేసే అవకాశం ఉంది.