LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకు సువర్ణావకాశం.. నిలిచిపోయిన పాలసీల పునరుద్దరణ!

LIC Policy: వైద్య, ఆరోగ్య అవసరాలపై ఎటువంటి రాయితీ ఉండదని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. ప్రీమియం చెల్లింపు కాలంలో గడువు ముగిసిన, పాలసీ వ్యవధి పూర్తి కాని పాలసీలను ఈ ప్రచారంలో తిరిగి ప్రారంభించవచ్చు. ప్రకటన ప్రకారం.. ఏదైనా ప్రతికూల పరిస్థితి..

LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకు సువర్ణావకాశం.. నిలిచిపోయిన పాలసీల పునరుద్దరణ!

Updated on: Aug 19, 2025 | 8:20 AM

LIC Policy: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), సోమవారం ఒక పెద్ద ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ LIC నిలిపివేసిన వ్యక్తిగత బీమా పాలసీని తిరిగి ప్రారంభించాలని ఒక ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ప్రచారం ఒక నెల పాటు నిర్వహించనుంది. నిలిపివేసిన బీమా పాలసీని తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఆగస్టు 18న ఓ ప్రచారాన్ని ప్రారంభించింది ఎల్‌ఐసీ. ఈ ప్రచార కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుంది. దీని పాలసీని తిరిగి ప్రారంభించడానికి ఆలస్య రుసుములో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందించనుంది.

ఇది కూడా చదవండి: Chatgpt Advice: కొంపముంచిన చాట్‌ జీపీటీ సలహా.. మూడు వారాలు ఆస్పత్రిలో.. అసలేమైందంటే..

సూక్ష్మ బీమా పాలసీలకు ఆలస్య రుసుములపై 100% మినహాయింపు:

ఇవి కూడా చదవండి

ఈ పథకం కింద అన్ని నాన్-లింక్డ్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పథకాలకు ఆలస్య రుసుములపై 30 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు LIC ఒక ప్రకటనలో తెలిపింది. పునరుద్ధరణకు అర్హత ఉంటే గరిష్టంగా రూ. 5000 వరకు ఉంటుంది. అదే సమయంలో మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ (తక్కువ ఆదాయ కుటుంబం లేదా వ్యక్తికి బీమా పాలసీ) కోసం ఆలస్య రుసుములపై 100 శాతం తగ్గింపు ఇస్తున్నారు. ఈ ప్రత్యేక పునరుద్ధరణ ప్రచారం కింద పాలసీ నిబంధనలు, షరతులు నెరవేరితే మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి 5 సంవత్సరాలలోపు పాలసీని ప్రారంభించవచ్చు.

వైద్య/ఆరోగ్య అవసరాలపై రాయితీ లేదు:

వైద్య/ఆరోగ్య అవసరాలపై ఎటువంటి రాయితీ ఉండదని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. ప్రీమియం చెల్లింపు కాలంలో గడువు ముగిసిన, పాలసీ వ్యవధి పూర్తి కాని పాలసీలను ఈ ప్రచారంలో తిరిగి ప్రారంభించవచ్చు. ప్రకటన ప్రకారం.. ఏదైనా ప్రతికూల పరిస్థితి కారణంగా సకాలంలో ప్రీమియం చెల్లించలేకపోయిన పాలసీదారుల ప్రయోజనం కోసం ఈ ప్రచారం ప్రారంభించింది. పాత పాలసీని పునరుద్ధరించడం, బీమా కవరేజీని పునరుద్ధరించడం ఎల్లప్పుడూ మంచిదని LIC తెలిపింది.

ఇది కూడా చదవండి: iPhone 15: ఆపిల్‌ ప్రియులకు కళ్లు చెదిరే ఆఫర్‌.. కేవలం రూ.32 వేలకే ఐఫోన్‌ 15

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి