Latest Gold Silver Prices: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం తెలిసిందే. తాజాగా.. పసిడి, వెండి ధరలు తగ్గాయి. గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.241 తగ్గి రూ .50,671 కి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ఈ సమాచారాన్ని వెల్లడించింది. దీని కారణంగా, క్రితం ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.50,912 వద్ద ముగిసింది. అయితే కిలో వెండి ధర రూ.87 పెరిగి రూ.61,384కి చేరుకుంది. గత ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ .61,297 వద్ద ముగిసింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,009గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,370, 24 క్యారెట్ల ధర రూ.52,529 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,009 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009 గా ఉంది.