Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం.. అదే బాటలో వెండి..!

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంటుంది..

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం.. అదే బాటలో వెండి..!

Updated on: Jun 23, 2022 | 6:46 AM

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంటుంది. ఇక తాజాగా దేశీయంగా పది గ్రాముల బంగారం ధరపై రూ.220 వరకు తగ్గుముఖం పట్టింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక జూన్‌ 23 (గురువారం) దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1.  తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,760 వద్ద ఉంది.
  2. ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 ఉంది.
  3. ఇవి కూడా చదవండి
  4. తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,860 వద్ద ఉంది.
  5. మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 వద్ద కొనసాగుతోంది.
  6. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800 వద్ద ఉంది.
  7. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.
  8. కర్ణాటకలోని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800 ఉంది.
  9. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక దేశంలో పసిడి తగ్గుముఖం పడితే అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, విజయవాడలో రూ.66,000 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.66,000 ఉండగా, ముంబైలో రూ.60,500 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.60,500 ఉండగా, కోల్‌కతాలో రూ.60,500 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.66,000 ఉండగా, కేరళలో రూ.66,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి