Gold Silver Price Today: దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పెరుగుతూ తగ్గుతూ వచ్చిన ధరలు సోమవారం మాత్రం నికలడగా ఉన్నాయి. దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు కారణాలు లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 19న దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 వద్ద ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 వద్ద ఉంది.
వెండి ధరలు..
ఇక బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి ధర కూడా అలాగే వెళ్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,700 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.62,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.62,000 ఉండగా, చెన్నైలో రూ.62,000 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.56,700 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.56,700 ఉంది. ఇక కేరళలో రూ.62,000 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని మిగతా ప్రధాన నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి