Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

|

Aug 30, 2023 | 6:58 AM

Gold Rate Today: డిమాండ్ పెరగడం, తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, నేడు బంగారం, వెండి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. దీని ప్రభావం ఎంసీఎక్స్‌పై కూడా ఉంది. గోల్డ్, సిల్వర్ తాజా ధరలను ఇప్పుడు తెలుసుకుందాం..

Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us on

Gold Rate Today: డిమాండ్ పెరగడం, తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, నేడు బంగారం, వెండి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. దీని ప్రభావం ఎంసీఎక్స్‌పై కూడా ఉంది. గోల్డ్, సిల్వర్ తాజా ధరలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.54,700కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670లకు చేరుకుంది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కీలక ప్రకటన చేసింది.

వెండి రేటు..

వెండి ధరలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం కిలో వెండి ధర రూ.77,100 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజుతో పోల్చితే రూ.200ల మేర పెరిగింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వెండి ధర కిలోకు రూ.80,000లుగా ట్రేడ్ అవుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. (10 గ్రాములు)

నగరం 22 క్యారెట్ల బంగారం 24 క్యారెట్ల బంగారం
చెన్నై రూ.55,200 రూ.60,220
ముంబై రూ.54,700 రూ.59,670
ఢిల్లీ రూ.54,850 రూ.59,820
కోల్‌కతా రూ.54,700 రూ.59,670
బెంగళూరు రూ.54,700 రూ.59,670
హైదరాబాద్ రూ.54,700 రూ.59,670
కేరళ రూ.54,700 రూ.59,670
పూణే రూ.54,700 రూ.59,670
విజయవాడ రూ.54,700 రూ.59,670
అహ్మదాబాద్ రూ.54,750 రూ.59,720

బంగారం, వెండి ధరలపై నిర్ణయం..

బంగారం ధరలు డిమాండ్, సరఫరాలపై ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. బంగారం డిమాండ్ పెరగడం అంటే కచ్చితంగా రేటు పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. బంగారం సరఫరా తగ్గితే రేటు కూడా తగ్గుతుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి గోల్డ్ రేట్లు మారుతుంటాయి. ఉదాహరణకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగోలేకుంటే, పెట్టుబడిదారులు పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తుంటారు. దీంతో గోల్డ్ రేట్ పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి అందించాం. ఇక్కడ చూపించిన ధరల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. నగలు లేదా బంగారం, వెండి కొనేముందు ధరలను చెక్ చేసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..