Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ రేట్ ఎంతకు చేరిందో తెలుసా.?

|

May 21, 2023 | 6:17 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం ఒక్కసారిగా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 550 పెరగడం గమనార్హం. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా...

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ రేట్ ఎంతకు చేరిందో తెలుసా.?
Gold Price Today
Follow us on

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం ఒక్కసారిగా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 550 పెరగడం గమనార్హం. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 61,420కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆదివారం పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,570 గా ఉంది.

* ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,420 పలుకుతోంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,960గా ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,470 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,420 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,420 పలుకుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,420 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,300 లుగా ఉంది. ఇక చెన్నై, బెంగళూరు నగరాల్లో కిలో కిలో వెండి ధర రూ.79,000 పలుకుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో కూ డా కిలో వెండి ధర రూ.79,000లుగా ట్రేడ్‌ అవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..