Gold Price Today: పుత్తడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. శుక్రవారం ఎలా ఉన్నాయంటే..?

Gold Price Today: బులియన్ మార్కెట్‌‌లో పసిడి ప్రియులకు స్వల్పం ఊరట లభించింది. గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు శుక్రవారం కూడా కొద్దిగా తగ్గాయి. ఈ క్రమంలో శుక్రవారం(జూన్ 23) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: పుత్తడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. శుక్రవారం ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today

Updated on: Jun 23, 2023 | 7:18 AM

Gold Price Today: బులియన్ మార్కెట్‌‌లో పసిడి ప్రియులకు స్వల్పం ఊరట లభించింది. గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు శుక్రవారం కూడా కొద్దిగా తగ్గాయి. ఈ క్రమంలో శుక్రవారం(జూన్ 23) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.54, 500 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,450 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర విషయానికొస్తే 10 గ్రాములపై 10 రూపాయలు(కేజీకి రూ.1000) మాత్రమే తగ్గి రూ.720గా ఉంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

బంగారం ధరలు: దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం 54,650 రూపాయలగానూ, 24 క్యారెట్ల ధర రూ.59,600 ఉంది. అలాగే ముంబై, బెంగళూరు, కేరళలో 22 క్యారెట్ల పసిడి రూ.54,500, 24 క్యారెట్ల బంగారం రూ.59,450.. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,500, 24 క్యారెట్ల పసిడి రూ.59,450గా ఉంది. మన తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరల గురించి చెప్పుకోవాలంటే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 59,450 రూపాయలుగా ఉంది.

వెండి ధరలు: ముందుగా చెప్పుకున్నట్లుగా శుక్రవారం వెండిధరలు కేజీపై రూ.1000 తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కేజీ వెండి ధర రూ.72000గా ఉంది. అలాగే ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కూడా వెండి ధర 72000 ఉండగా.. కేరళ, చెన్నైలో కేజీ రూ.75000 ఉంది. తెలుగురాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లోనూ కిలో వెండి ధర 75000 రూపాయలుగానే ఉంది.

ఇవి కూడా చదవండి

నోట్: ఈ కథనంలో తెలియజేసిన ధరల వివరాలు శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవి, కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించాలని మనవి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..