Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

|

Sep 27, 2024 | 7:04 AM

గోల్డ్ ప్యూరిటీని క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ గోల్డ్ స్వచ్ఛత, రేట్ పెరుగుతాయి. మన దేశం పసిడి కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున.. డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా బంగారం రేట్లపై ఎఫెక్ట్ చూపుతుంది.

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
Gold
Follow us on

స్వతహాగా భారతీయ మహిళలు ఆభరణ ప్రియులు. పైగా శుభ సందర్భం ఏదైనా తాహతుకు తగ్గట్టు ఎంతోకొంత బంగారం కొనుగోళ్లు తప్పనిసరి. అందుకే కొనుగోళ్ల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు.  ఏ శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది పసిడే. అంతగా మన జీవితాల్లో పెనవేసుకుపోయింది బంగారం. ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి కూడా గోల్డ్ మంచి ఆప్షన్. తెలుగు లోగిళ్లలో పసిడితో పాటు వెండికి కూడా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వీటి ధరలు ఎలా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు జనాలు. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.. దేశంలో గోల్డ్ రేట్స్ రికార్డు స్థాయిల వద్ద ఉన్నాయి. పసిడి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 77,010కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 77,020గా ఉంది. మరోవైపు 22క్యారెట్లు 10గ్రాముల పసిడి ధర రూ. 10 తగ్గి.. రూ. 70,590కి చేరింది.

– హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 77,010గా ఉంది

– 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 70,590కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

=========

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. ప్రజంట్.. కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 95,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 95,000గా ఉండేది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,00,900 పలుకుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..