
బంగారం కొనుగోలు దారులకు ఊరట. గత కొన్ని రోజుల వరకు పరుగులు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు సోమవారం (అక్టోబర్ 23) మాత్రం స్థిరంగా కొనసాగాయి. ఆదివారంతో పోల్చుకుంటే ఇవాళ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. సోమవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 56,600 ధర పలుకుతోంది. అదేవిధంగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,750 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.75, 300 పలుకుతోంది. మరి సోమవారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
ఇక సోమవారం వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగాయి. దేశవ్యాప్తంగా ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర 75,300 రూపాయలు పలుకుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 78,700 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ. 75,300గా ఉండగా, చెన్నైలో 78,700లకు కిలో వెండి లభిస్తోంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..