బంగారం ప్రియులకు స్వాతంత్య్ర దినోత్సవం రోజును ధరలు దిగి వచ్చాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వరుసగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో, అదే విధంగా దేశీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు పడిపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. డాలర్, బాండ్ ఈల్డ్స్ గిరాకీ పడిపోయి గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. తాజాగా ఆగస్టు 15న బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. తులం బంగారంపై వంద రూపాయల మేర తగ్గింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్లయితే స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 2450 డాలర్ల వద్ద ఉంది. అంతకుముందు ఇది ఒక దశలో 2470 డాలర్లపైకి కూడా చేరింది. ఇక స్పాట్ సిల్వర్ ధర 27.65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.98 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ పథకం 18వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? దరఖాస్తు చేయడం ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి