AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: మరోసారి రికార్డ్ దిశగా బంగారం ధరలు.. గత మూడు రోజుల్లో అందనంత ఎత్తుకి.. ఒకేసారి ఎంత పెరిగాయంటే..?

బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. గత మూడు రోజులుగా రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేస్తన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ క్షీణత, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు పసిడిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గత మూడు రోజుల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Rates: మరోసారి రికార్డ్ దిశగా బంగారం ధరలు.. గత మూడు రోజుల్లో అందనంత ఎత్తుకి.. ఒకేసారి ఎంత పెరిగాయంటే..?
Gold
Venkatrao Lella
|

Updated on: Aug 21, 2026 | 1:50 PM

Share

బంగారం ధరలు మరోసారి ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. జనవరిలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయిని నమోదు చేయగా.. ఆ తర్వాత పడిపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. గత నెల నుంచి రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోండగా.. ఆగస్ట్ 21వ తేదీన రూ.1.60 లక్షల మార్క్ దాటింది. దీంతో రాబోయే రోజుల్లో మరోసారి గరిష్ట స్థాయికి పసిడి ధరలు చేరుకునే అవకాశముందనే అంచనాలు ఆర్ధిక విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. డాలర్ బలహీనపడుతుండటంతో, యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ బాండ్ల రాబడిని తగ్గించడంతో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ఈ కారణంతో ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. డాలర్ విలువ కుప్పకూలుతుండటంతో.. ఇరత కరెన్సీలు కలిగినవారికి డాలర్ ఆధారిత వస్తువులు తక్కువకే లభిస్తున్నాయి.

గత మూడు రోజుల్లో బంగారం ధరలు ఏకంగా రూ.6,500 మేర పెరిగాయి. ఇక వెండి ధర అయితే రూ.14 వేలు పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్సైంజ్‌లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన సిల్వర్ ప్యూచర్స్ కిలోకు రూ.2986 పెరిగి ప్రస్తుతం రూ.2,46,229కి చేరుకున్నాయి. ఇక అక్టోబర్ డెలివరీ గోల్డ్ ప్యూచర్స్ రూ.1205 పరిగి రూ.1.60,630కి చేరుకున్నాయి. ఇక అంతర్జాతీయగా చూస్తే స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు 4,514.23 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ వారంలో 3.2 శాతం మేర పుంజుకుననాయి. ఇక యూఎస్ గోల్డ్ ప్యూచర్స్ 4571.20 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా.. స్పాట్ వెండి ధరలు ఔన్సుకు 68.03 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక దేశీయ బులియన్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి.

భారత బులియన్ మార్కెట్లో ఆగస్ట్ 21న శుక్రవారం 10 గ్రామలు 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,60,480 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.1210 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,47,100గా కొనసాగుతుండగా.. నేడు రూ.1100 మేర పెరుగుదలను నమోదు చేశాయి. ఇక హైదరాబాద్‌, చెన్నైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,630 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,47,250 వద్ద కొనసాగుతున్నాయి. అటు సిల్వర్ ధరలు కూడా ఇవాళ పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.65 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.60 లక్షలుగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు రూ.5 వేల మేర పెరిగాయి. బంగారం ధరలు భారీగా పెరుగుతుండగా.. సిల్వర్ ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉంటాయనే దానిపై పెట్టుబడిదారులతో పాటు సామాన్యుల్లోనూ ఆసక్తి నెలకొంది.

Follow Us