Gold Prices: పసిడి కొనుగోలుదారులకు షాకింగ్‌.. భారీగా పెరగనున్న బంగారం ధర..!

|

Jan 21, 2022 | 4:43 PM

Gold Prices: గత కొన్ని రోజులుగా పసిడి ధర పరుగులు పెడుతోంది. బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి..

Gold Prices: పసిడి కొనుగోలుదారులకు షాకింగ్‌.. భారీగా పెరగనున్న బంగారం ధర..!
Follow us on

Gold Prices: గత కొన్ని రోజులుగా పసిడి ధర పరుగులు పెడుతోంది. బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. భారతీయులు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. కేవలం పది రోజుల్లోనే బంగారం ధర రూ.1000పైగా పెరిగింది. ఇప్పుడు బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీరేట్లు, దేశీయ స్టాక్‌ మార్కెట్లు పతనం అవుతున్న కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపు రావడంతో మళ్లీ బంగారానికి డిమాండ్‌ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.

మున్ముందు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగినట్లయితే రాబోయే కాలంలో అంటే 12 నుంచి 15 నెలల్లో బంగారం ధర గరిష్టంగా 2,000 డాలర్‌ (ఔన్స్‌కు)పైగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక ఔన్స్ 28.34 గ్రాములకు సమానం. అంటే, ఒక గ్రాము ధర రూ.5,252కు చేరుకోనుంది. ఇప్పుడు దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.48,589 ట్రేడవుతోంది. అమెరికాలో ప్రస్తుత బంగారం ధరలు డాలర్‌ 1840 ఔన్స్‌ వద్ద ఉన్నాయి. ద్రవ్యోల్బణం వల్ల బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

BMW X3 SUV: బీఎండబ్ల్యూ నుంచి మరో సరికొత్త కారు.. అత్యాధునిక ఫీచర్స్‌, ధర వివరాలు..!

Budget 2022: కేంద్రం బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తుంది…? ఎలాంటి కసరత్తు ఉంటుంది..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు