
భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.. ఏకంగా ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. గత మూడు రోజులుగా బంగారం క్రమంగా తగ్గుతూ వస్తోంది. బంగారం ధరకు కళ్ళెం పడడం దీంతో నవరాత్రి లేదా దీపావళి వంటి పండుగలకు లేదా వివాహాలకు లేదా ప్రస్తుతం బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి ఉపశమనం అని భావిస్తున్న వేళ.. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంతగా బంగారం ధర చేరుకుంది పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. ఈ రోజు ఆల్‌టైమ్ హైకి చేరుకుంది.
గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరకు కళ్ళెం పడిందని సంతోష పడేలోగా ఈ రోజు ఓ రేంజ్ లో పెరిగి.. ఆల్ టైం హైకి చేరుకుంది. ఈ రోజు (సెప్టెంబర్ 16వ తేదీన) మేలిమి బంగారం 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ.లక్షా 15వేల చేరువలో ఉంది. USలో వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాతో పసిడి ధర పరుగులు పెడుతున్నట్లు మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బులియన్స్ మార్కెట్ ప్రకారం సెప్టెంబర్ 13, 14 , 15 తేదీల్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర మొత్తం 220 తగ్గగా.. 100 గ్రాముల బంగారం ధర 2,200 తగ్గింది. అదే సమయంలో.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.200, 100 గ్రాములకు రూ.2,000 తగ్గింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్న సమయంలో ఈ తగ్గుదల సంభవించింది. ప్రపంచ మార్కెట్లలో కదలికను పెంచింది.
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు ₹ 1,15,000 ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే సంకేతాలే బంగారం ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. ఈ ఏడాదిలో బంగారం ధర 50 శాతానికి పైగా పెరిగింది.
బంగారం ధర తగ్గినప్పటికీ.. వెండి ధర నిరంతరం పెరుగుతోంది. సెప్టెంబర్ 12 , 13 మధ్య వెండి ధర కిలోకు ₹ 3,100 పెరిగింది. ప్రస్తుతం వెండి కిలోకు ₹ 1,33,000 రికార్డు స్థాయికి చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..