Gold and Silver Latest Prices: అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. సాధారణంగా మార్కెట్‌లో పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఎలాంటి శుభకార్యాలు జరిగినా, పండుగలైనా చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,160 గా ఉంది. అయితే, వెండి కిలో ధర రూ.78,000లుగా కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 ఉంటే.. 24 క్యారెట్లు రూ.60,320 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 55,150 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,160 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55150 గా ఉంటే.. 24 క్యారెట్లు 60,160 గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్లు రూ.60,600 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 గా ఉండగా.. 24 క్యారెట్ల పసడి ధర 60,160 గా ఉంది.
వెండి ధరలు: చెన్నైలో వెండి కిలో ధర రూ.80,500 లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.78,000, ముంబైలో రూ.78,000, బెంగళూరులో 76,500 లుగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధర రూ.80,500 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. కాగా.. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..