
Gold and Silver Price: భారతీయ మహిళను.. బంగారాన్ని వేరు చేసి చూడలేం. అంతగా బంగారం జీవితంలో ఒకభాగంగా మారిపోయింది. ఇక బంగారం అలంకారానికి మాత్రమే కాదు ఒక ఆర్ధిక వనరుగా కూడా భావిస్తారు. ఇక బంగారం తర్వాత వెండికి కూడా అదే రేంజ్ లో ప్రాధ్యాన్యత ఇస్తారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు బంగారం వెండి ఉండాల్సిందే.. ఇక గత కొంతకాలంగా బంగారాన్ని పెట్టుబడిగా ముదుపర్లు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు.
శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర తగ్గింది. బంగారం 10 గ్రాములకి 147 రూపాయలు తగ్గి 44,081 రూపాయలకు చేరుకుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది.
ఇక మరోవైపు వెండి ధర కూడా కిలోకు ఢిల్లీలో రూ.1,036 పెరిగి.. రూ.64,276 వద్ద స్థిరపడింది.అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,726 డాలర్లకు చేరింది. వెండి ధర 25.14 డాలర్లుగా ఉంది.
అయితే బంగారం ధరలను డాలర్ విలువ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, చమురు ధరలు వంటివి ప్రభావితం చేస్తాయి. ఒక్కోసారి బంగారం ధరల్లో చాలా కాలం ఎటువంటి మార్పు ఉండదు.. ఒకొక్కసారి హఠాత్తుగా పెరుగుతుంది. అందుల్లనే పసిడి వాస్తవిక విలువకు మార్కెట్ ధరలకు సంబంధం ఉందని తెలుస్తోంది. అందుకనే బంగారం నగలు కొనేవారు మార్కెట్ పరిస్థితులపై అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: రామ్ చరణ్ ఇంటివద్ద మెగా ఫాన్స్ చేస్తున్న హంగామ వీడియో…